అల్ట్రా స్టైలిష్‌ లుక్ లో ఐకాన్‌స్టార్!

అల్ట్రా స్టైలిష్‌ లుక్ లో ఐకాన్‌స్టార్!
X

అల్ట్రా స్టైలిష్‌ లుక్ లో ఐకాన్‌స్టార్!ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మరో ప్రతిష్టాత్మక గౌరవం లభించింది. ప్రముఖ హాలీవుడ్ సినీ మ్యాగజైన్ 'ది హాలీవుడ్ రిపోర్టర్' భారత్‌లో 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' పేరుతో విడుదలవుతుండగా, దీని తొలి సంచిక ముఖచిత్రంగా అల్లు అర్జున్ నిలిచాడు. 'అల్లు అర్జున్: ది రూల్' పేరుతో ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించింది ఈ మ్యాగజైన్.

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా కోసం ఐకాన్‌స్టార్ మళ్లీ స్టైలిష్ స్టార్ గా మారాడు. గత కొన్ని సంవత్సరాలుగా పుష్ప గెటప్ లో రగ్గడ్‌ గా కనిపించిన బన్నీ.. ఇప్పుడు స్టైలిష్‌ లుక్ లో అదరగొడుతున్నాడు. ఈ మ్యాగజైన్ షూట్ కోసం అల్లు అర్జున్ అల్ట్రా స్టైలిష్ గా కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాతో పాటు తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ ఓ భారీ చిత్రాన్ని చేయబోతున్నాడు. త్వరలోనే బన్నీ-అట్లీ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట. త్రివిక్రమ్, అట్లీ లతో అల్లు అర్జున్ చేయబోయే రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో రూపొందనున్నాయి.

Tags

Next Story