మీడియా తీరుతో బాధపడ్డాను – మంచు లక్ష్మి

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో టాలీవుడ్ నటి మంచు లక్ష్మిను గత నెల (ఆగస్టు 13) ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ లను కూడా అధికారులు ప్రశ్నించారు. తాజాగా మంచు లక్ష్మి ఈ అంశంపై స్పందించారు.
లక్ష్మి మాట్లాడుతూ 'ఈ కేసులో చిట్టచివరి వ్యక్తిని విచారించడం హాస్యాస్పదం. అసలు ఈ యాప్‌లు ఎక్కడ మొదలయ్యాయి? ఎవరు నడుపుతున్నారు? వాటి మూలాలను ఎందుకు గుర్తించలేకపోతున్నారు?' అని ప్రశ్నించారు. అలాగే మీడియా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 'మేము విచారణలో ఎదుర్కొన్నది ఒకటైతే, మీడియాలో మాత్రం మరోదాన్ని హైలైట్ చేశారు. అది చాలా బాధ కలిగించింది' అని వ్యాఖ్యానించారు.
బెట్టింగ్ యాప్‌ల డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ఎక్కడికి వెళ్తోంది? ఉగ్రవాదులకు నిధులు చేరుతున్నాయా? అనే అంశాలపై ఈడీ దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు. 'నాకు ఇవేవీ తెలియదు. 100 మంది ఈ యాప్‌లను ప్రమోట్ చేశారని, అందులో నేను కూడా ఉన్నానని చెప్పారు. అందుకే నేను విచారణకు వెళ్లాను. అది ఒక్క నిమిషం పని' అని ఆమె వివరించారు.
-
Home
-
Menu