ఈ 'గూఢచారి'పైనే ఆశలు!

తెలుగు తెరపై గూఢచారి చిత్రాలకు బాట వేసింది సూపర్ స్టార్ కృష్ణ. ‘గూఢచారి 116’తో మొదలైన ప్రయాణం, కాలక్రమేణా స్టైల్ మారినప్పటికీ, సబ్జెక్ట్ పట్ల ప్రేక్షకుల ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. చాలా గ్యాప్ తర్వాత ఈమధ్య కాలంలో మళ్లీ తెలుగులో గూఢచారులు ఊపందుకున్నారు. ఈ స్పై జానర్ పై ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు మేకర్స్.
ఇటీవలి కాలంలో ‘ఏజెంట్, స్పై, ఛారి 111, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, జాక్’ వంటి సినిమాలు ఈ జానర్ లోనే వచ్చాయి. అయితే వీటిలో కథనం సరైన దిశలో లేకపోవడం, కామెడీని ఓవర్‌గా మిక్స్ చేయడం వల్ల ఆశించిన స్థాయిలో నిలవలేకపోయాయి. గూఢచారి సినిమాల్లో రియాలిటీ, థ్రిల్, ఇంటెన్సిటీ అన్నీ సమపాళ్లలో ఉండాలి. లేకపోతే అవి కేవలం స్కిట్‌లా మారిపోతాయి.
అయితే ప్రస్తుతం ఈ జానర్ లో రాబోతున్న 'గూఢచారి 2'పై మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే సూపర్ హిట్టైన అడవి శేష్ 'గూఢచారి'కి కొనసాగింపుగా ఈ సినిమా వస్తోంది. రియాలిటీకి పెద్ద పీట వేస్తూ.. టైట్ స్క్రీన్ ప్లేతో వచ్చిన 'గూఢచారి' మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు అవే అంశాలతో పాన్ ఇండియా లెవెల్ లో 'గూఢచారి 2'ని తీసుకొస్తున్నాడు అడవి శేష్.
మొత్తంగా గూఢచారి అనే జానర్ క్రేజీగా అనిపించినా, దీన్ని తేలికగా తీసుకుంటే అది పెద్ద ప్రమాదమే. ప్రతి సన్నివేశం బలంగా ఉండాలి. స్క్రిప్ట్‌ను పదిసార్లు తిరిగి పరిశీలించాల్సిందే. అలా కాకుండా సరదాగా ట్రీట్ చేస్తే, ఎంచుకున్న హీరో, దర్శకుడి కెరీర్‌పై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
-
Home
-
Menu