పూజా హెగ్డే కోలీవుడ్‌లో సెటిల్ అవుతుందా?

పూజా హెగ్డే కోలీవుడ్‌లో సెటిల్ అవుతుందా?
X

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన పూజా హెగ్డే తెలుగులో దాదాపుగా సినిమాలు చేయడం మానేసింది. ‘అల.. వైకుంఠపురములో‘ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ అదే దర్శకుడు త్రివిక్రమ్ తీసిన ‘గుంటూరు కారం‘లో హీరోయిన్ గా ఎంపికయ్యింది. కానీ అనివార్య కారణాలతో ఆ సినిమా నుంచి తప్పుకుంది. ప్రభాస్ తో చేసిన ‘రాధేశ్యామ్‘, మెగా మూవీ ‘ఆచార్య‘ పూజాకి నిరాశనే మిగిల్చాయి. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమకు దాదాపు దూరమయ్యింది ఈ బుట్టబొమ్మ.

మరోవైపు తమిళంలో మాత్రం వరుస సినిమాలతో బిజీ అవుతుంది. విజయ్ చివరి చిత్రంగా చెప్పుకుంటోన్న ‘జననాయగన్‘లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. మరో అగ్ర కథానాయకుడు సూర్య ‘రెట్రో‘ మూవీలోనూ హీరోయిన్ గా చేస్తుంది. ఇంకా లారెన్స్ సూపర్ హిట్ హారర్ ఫ్రాంఛైస్ లో వస్తోన్న ‘కాంచన 4‘లోనూ కథానాయికగా నటిస్తుంది పూజా. లేటెస్ట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ‘లోనూ పూజా నటిస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది.

Tags

Next Story