బన్నీ-అట్లీ సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుంది?

బన్నీ-అట్లీ సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుంది?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ‘పుష్ప 2’. అల్లు అర్జున్ ఎనర్జీ, సుకుమార్ మాస్టర్‌క్రాఫ్ట్ కలసి 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు లిఖించింది. అయితే, ఇప్పుడంతా ఆయన బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఏంటి? అనే దానిపైనే డిస్కషన్.

అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉంటుందని ముందుగా ప్రకటించాడు. కానీ, కొన్ని అనూహ్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ ముందుకి వెళ్లలేదు. అల్లు అర్జున్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం త్రివిక్రమ్ ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నాడట. ఈ గ్యాప్ లో తమిళ దర్శకుడు అట్లీతో ఒక సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్.

ఇప్పటికే ఈ సినిమాను గీతా ఆర్ట్స్, సన్ పిక్చర్స్ కలిసి నిర్మించేందుకు ముందుకు వచ్చాయట. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం అంచనా వేసిన బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు అవుతున్నట్టు తెలుస్తోంది. మరి.. ఈ మూవీ ఆలస్యానికి నిజంగా బడ్జెట్ కారణమా? లేక ఇతర కారణాలున్నాయా? అనేది మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చేవరకు మిస్టరీయే. మొత్తంగా బన్నీ ఫ్యాన్స్ మాత్రం త్వరగా ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ రావాలని ఎదురు చూస్తున్నారు.

Tags

Next Story