విజయ్ సేతుపతి, నిత్యమీనన్ మూవీ షూటింగ్ పూర్తి !

విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఓ చిత్రాన్ని ‘పసంగా’ ఫేమ్ పాండిరాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ఏమిటంటే, దీని షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా ద్వారా విజయ్ సేతుపతి, పాండిరాజ్ తొలిసారిగా కలిసి పని చేయడం విశేషం. అంతేకాకుండా, మలయాళ చిత్రం 19(1)(a) తర్వాత మళ్లీ ఈ సినిమాతో విజయ్, నిత్యా మళ్లీ స్క్రీన్‌ను షేర్ చేసుకుంటున్నారు.
ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలింస్ నిర్మిస్తోంది. చిత్రానికి సంబంధించిన కథా, పాత్రల వివరాలను మేకర్స్ ఇప్పటివరకు వెల్లడించలేదు. అయితే, షూటింగ్ పూర్తి చేసిన విషయాన్ని తెలియజేస్తూ.. ఈ సినిమాను "ఒక హృదయపూర్వకమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్"గా వర్ణించారు. ఈ చిత్రంలో ప్రముఖ హాస్య నటుడు యోగిబాబు, మలయాళ నటుడు చెంబన్ వినోద్ జోస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్ట్ షూట్ ఫోటోలో దీపా శంకర్, శరవణన్, రోషిని హరిప్రియన్ తదితర నటులు కూడా కనిపించారు.
విజయ్ సేతుపతి ప్రస్తుతం ‘ట్రైన్, ఏస్, గాంధీ టాక్స్’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. మరోవైపు, నిత్యా మీనన్, హీరో, దర్శకుడు ధనుష్‌తో కలిసి ఇడ్లీ కడై అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
-
Home
-
Menu