‘రెట్రో’ హీరో సినిమాలో రౌడీ హీరో?

తమిళ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం ‘రెట్రో’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. సూర్య తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టాడు. ‘రెట్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సూర్య తన 46వ సినిమా దర్శకుడు వెంకీ అట్లూరితో చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతోంది. తాజా సమాచారం ప్రకారం... ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ కూడా కీలక పాత్ర పోషించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
సూర్యతో కలిసి విజయ్ స్క్రీన్ షేర్ చేసేందుకు మేకర్స్ ఆయనను సంప్రదించారని.. అందుకే 'రెట్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఆయన హాజరయ్యారనేది బజ్. అయితే ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ కానీ, చిత్ర యూనిట్ కానీ ఈ వార్తను ధ్రువీకరించలేదు. ఇక సూర్య46 విషయానికొస్తే .. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.
విడుదల చేసిన ఒక చిన్న వీడియోలో సూర్యా మాట్లాడుతూ .. “ఇది నా తదుపరి సినిమా. మీరు ఎప్పటినుంచో అడుగుతున్నట్టుగా నా తదుపరి తమిళ సినిమా వెంకీ అట్లూరితోనే. ఈ సినిమా కోసం నేను హైదరాబాద్‌లో ఎక్కువ రోజులు గడపబోతున్నాను. మే నుంచి షూటింగ్ మొదలు అవుతుంది,” అని చెప్పారు. అలాగే, ఈ ప్రయాణాన్ని అల్లు అరవింద్ ఆశీర్వాదాలతో ప్రారంభి స్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఇంతవరకు అధికారిక ప్రకటన రాకపోయినా, సూర్య, వెంకీ అట్లూరి సినిమాలో విజయ్ దేవరకొండ చేరితే అది తమిళ, తెలుగు అభిమానులకు పండుగే అవుతుంది.
-
Home
-
Menu