పెద్ద సినిమాలతో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ పోటీ

పెద్ద సినిమాలతో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ పోటీ
X
సూర్య "రెట్రో", నాని "హిట్ 3" సినిమాలతో క్లాష్ జరుగుతున్నా.. శశికుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం ప్రత్యేకమైన బజ్‌ను సంపాదించుకుంది.

ఈ వారం థియేటర్లలో భారీ సినిమాలతో పోటీపడుతున్న "టూరిస్ట్ ఫ్యామిలీ" అనే తాజా తమిళ కామెడీ డ్రామా మంచి ఆసక్తిని రేపుతోంది. సూర్య "రెట్రో", నాని "హిట్ 3" సినిమాలతో క్లాష్ జరుగుతున్నా.. శశికుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం ప్రత్యేకమైన బజ్‌ను సంపాదించుకుంది. ఈ సినిమా మే 1న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఇందులో హీరో శశికుమార్ దాస్ పాత్రలో కనిపించనుండగా.. "గుడ్ బ్యాడ్ అగ్లీ" చిత్రంలో నటించిన నిన్నటి తరం హీరోయిన్ సిమ్రన్ వసంతిగా కనిపించనుంది.

యోగి బాబు శశికుమార్‌కు మిత్రుడిగా, మిథున్ జై శంకర్.. శశికుమార్ కుమారుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాను అభిషన్ జీవింత్ రచించి, దర్శకత్వం వహించారు. షాన్ రోల్డన్ సంగీతం అందించాడు. మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్‌పి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లపై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంది. సినిమా సెన్సార్ బోర్డు నుంచి "U" సర్టిఫికేట్ పొందింది. నిడివి రెండు గంటలు ఎనిమిది నిమిషాలు.

"టూరిస్ట్ ఫ్యామిలీ" ఒక శ్రీలంక తమిళ కుటుంబం. నలుగురు సభ్యులు కలిగిన ఈ కుటుంబం శరణార్థులుగా తమిళనాడుకు వస్తారు. అక్కడ కొత్త దేశం, కొత్త పరిసరాలకు అలవాటుపడుతూ ఎదుర్కొన్న సవాళ్ళను, జాతి వివక్షను, హాస్యాన్ని మేళవించి మనోహరమైన కుటుంబ కథగా ఈ సినిమా ఆవిష్కృతమైంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా పెద్ద సినిమాల్ని తట్టుకొని ఎలా నిలబడుతుందో చూడాలి.

Tags

Next Story