భారీ ప్రీరిలీజ్ బిజీనెస్ చేసిన కమల్ హాసన్ చిత్రం !

భారీ ప్రీరిలీజ్ బిజీనెస్ చేసిన కమల్ హాసన్ చిత్రం !
X
థగ్ లైఫ్ కు భారీ క్రేజ్ ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ విపరీతంగా జరుగుతోంది.

‘పొన్నియిన్ సెల్వన్’ సిరీస్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన మణిరత్నం.. లాంగ్ గ్యాప్ తర్వాత కమల్ హాసన్‌తో పాన్ ఇండియన్ మూవీ ‘థగ్ లైఫ్’ మూవీ తెరకెక్కించ బోతుండడం విశేషం. 38 ఏళ్ల క్రితం వచ్చిన కల్ట్ క్లాసిక్ ‘నాయగన్’ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘థగ్ లైఫ్’ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తవగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియన్ లెవెల్లో విడుదలకానుంది. మణిరత్నం దర్శకత్వ ప్రతిభ, కమల్ హాసన్ నటనలో మరింత కూర్పుతో ఈ చిత్రం ఈ ఏడాది మోస్ట్ ఎవైటెడ్ మూవీగా మారింది. ఈ సినిమాలో కమల్‌తో పాటు తమిళ్ స్టార్ నటీనటులు శింబు, త్రిష, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, అభిరామి, నాజర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఇప్పటికే థగ్ లైఫ్ కు భారీ క్రేజ్ ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ విపరీతంగా జరుగుతోంది. ఓటీటీ హక్కుల రూపంలోనే సుమారు రూ. 150 కోట్ల భారీ డీల్ సెట్టయ్యింది. కమల్‌ నటించిన గత చిత్రాలకు కూడా ఈ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల థియేట్రికల్ రైట్స్‌ కోసం కూడా మంచి డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రైట్స్ రూ. 20 కోట్లు, కర్ణాటక రైట్స్ రూ. 15 కోట్లకు బిజినెస్ జరిగినట్లు సమాచారం.

Tags

Next Story