నయనతార స్థానంలో మిల్కీ బ్యూటీ?

సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘ముక్కుతి అమ్మన్ 2’. ఈ మూవీ గురించి ఇప్పుడు ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న నయనతారను తప్పించనున్నారా? అనే ఊహాగానాలు పరిశ్రమలో వినిపిస్తున్నాయి.
రీసెంట్‌గా ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఆ వేడుకకు నయనతారతో పాటు రెజీనా కసాండ్రా, మీనా సాగర్, ఖుష్బూ తదితరులు హాజరయ్యారు. అయితే షూటింగ్ ప్రారంభమైన కొద్దిరోజులకే నయనతార ఒక సహాయ దర్శకుడితో వాగ్వాదం చేసినట్లు సమాచారం. ఈ ఘటన కారణంగా సినిమా షూటింగ్ ఒక రోజు నిలిచిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో దర్శకుడు సుందర్ సి నయనతార వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారని, తన స్థానాన్ని మిల్కీ బ్యూటీ తమన్నాతో భర్తీ చేయాలని భావిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. తమన్నా ఇప్పటికే ‘ఓదెల 2’ చిత్రాన్ని పూర్తిచేసి.. కొత్త ప్రాజెక్టులకు సిద్ధమవుతోంది. అంతేకాదు, ఆమెకు సుందర్ సితో మంచి అనుబంధం ఉండటంతో, ఈ సినిమాలోకి రానున్న అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. అయితే, ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ‘ముక్కుతి అమ్మన్ 2’ లో చివరికి ఎవరు నటిస్తారనేది వేచిచూడాలి.
-
Home
-
Menu