దళపతి 69 ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఫిక్స్ !

తమిళ దళపతి విజయ్.. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించే ముందు చివరి సినిమా అయిన దళపతి 69 గురించి అభిమానుల్లో ఉత్సాహం మిన్నంటోంది. హెచ్. వినోద్ దీనికి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ జనవరి 26, రిపబ్లిక్ డే రోజు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ అప్‌డేట్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను అభిమానులు జనవరి 26న చూడబోతున్నారు. ఈ సందర్భంగా దళపతి విజయ్ కెరీర్‌ను ప్రతిబింబించేలా ఆయన మొదటి సినిమా నుంచి 68వ సినిమా ‘గోట్’ వరకు ఉన్న విశేషాలను ప్రత్యేక వీడియో మాంటేజ్ రూపంలో విడుదల చేశారు.
2024 అక్టోబర్‌లో విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించి ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అనే పార్టీని తమిళనాడులో విక్రవాండిలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థాపించారు. ఆ వేడుకకు మూడు లక్షల మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. ద్రవిడ రాజకీయాల్లో ప్రాబల్యం ఉన్న తమిళనాడు రాజకీయాలను 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సవాలు చేయాలని చూస్తున్నారు.
దళపతి 69 చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించగా, ఇది తమిళ చిత్ర పరిశ్రమలో వారి తొలి చిత్రం. ఈ సినిమాలో విజయ్ 'ప్రజాస్వామ్యానికి దీపస్తంభం' అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ కథ అతని రాజకీయ ప్రయాణం, ముఖ్యంగా TVK పార్టీ స్థాపనతో ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో విజయ్‌తో పాటు పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, ప్రకాశ్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. విజయ్‌తో కలిసి గతంలో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించిన అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
-
Home
-
Menu