సూర్యకి జోడీగా ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ ?

‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లో హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం దక్కక పోయినప్పటికీ, ఆమె డ్యాన్సింగ్ టాలెంట్ , ఆకట్టుకునే అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించడంతో, టాలీవుడ్‌లో కొత్త అవకాశాల వరద కొనసాగుతోంది. అలాగే ఇతర భాషల్లోనూ అమ్మడికి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.
ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. దుల్కర్ సల్మాన్ సరసన సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో "కాంత" అనే చిత్రంలో నటిస్తోంది . ఇప్పటికే షూటింగ్ పూర్తయి.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అలాగే, ఎనర్జిటిక్ స్టార్ రామ్ 22వ చిత్రంలో అతడి సరసన నటిస్తోంది. మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.
ఇదే కాకుండా.. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందుతున్న "కింగ్‌డమ్" అనే చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌తో ఆమె స్థానం మరింత బలపడుతోంది. ఇప్పటికే టాలీవుడ్‌లో పలు అవకాశాలు దక్కించుకున్న భాగ్యశ్రీ... అటు కోలీవుడ్‌లోనూ పెద్ద అవకాశాన్ని చేజిక్కించుకున్నట్లు సమాచారం.
తాజా బజ్ ప్రకారం.. తమిళ స్టార్ హీరో సూర్య కొత్త చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికైనట్లు టాక్ నడుస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి భాగ్యశ్రీతో అధికారిక చర్చలు పూర్తయినట్లు.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే త్వరలోనే సౌత్ లో బిజీ హీరోయిన్ అవుతుందని చెప్పొచ్చు.
-
Home
-
Menu