మలయాళ క్రేజీ హీరో దర్శకత్వంలో సూర్య సినిమా?

తమిళ స్టార్ హీరో సూర్య ఇంతవరకూ తన దృష్టిని పూర్తిగా ‘కంగువ’ సినిమాపైనే కేంద్రీకరించాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించక పోవడంతో, ఇకపై కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడతడు ఆసక్తికరమైన కథలను ఎంచుకుంటూ కొత్త ప్రాజెక్టులకు సంతకం చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
2025లో సూర్య ఆర్ఎజే బాలాజీ దర్శకత్వంలో సినిమా, అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడివాసల్’ అనే చిత్రాలతో బిజీగా ఉండనున్నాడు. ఇదిలా ఉంటే.. మలయాళ డైరెక్టర్ కమ్ హీరో .. బేసిల్ జోసెఫ్ ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఒక కథను వినిపించాడని తెలుస్తోంది. సూర్యకు ఆ కథ నచ్చడంతో ప్రారంభ చర్చలు మొదలయ్యాయని సమాచారం. అన్నీ అనుకూలంగా సాగితే, ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్.
‘మిన్నల్ మురళి’ మలయాళ సినిమాతో.. దర్శకుడిగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు బేసిల్ జోసెఫ్. టొవినో థామస్ హీరోగా నటించిన ఈ సూపర్‌హీరో చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకున్నాడు బెసిల్. ప్రస్తుతం సౌత్ లోనే అత్యంత ప్రతిభావంతమైన దర్శకుల్లో ఒకరిగా అతను నిలిచాడు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో ‘శక్తిమాన్’ సినిమాకి కమిట్ మెంట్ ఇచ్చిన బేసిల్.. ఇప్పుడు సూర్యతో కూడా సూపర్ హీరో సినిమా తీయబోతుండడం విశేషంగా మారింది. మరి సూర్యతో బేసిల్ ఏ రేంజ్ సినిమా తీస్తాడో చూడాలి.
-
Home
-
Menu