డబ్బింగ్ పనులు పూర్తి చేసిన సూర్య !

డబ్బింగ్ పనులు పూర్తి చేసిన సూర్య !
X
ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ డబ్బింగ్ పనులను సూర్య తాజాగా పూర్తిచేశారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ చిన్న వీడియోలో, డబ్బింగ్ స్టూడియో నుంచి సూర్య మాట్లాడుతూ "రెట్రో డబ్బింగ్ కట్ అండ్ రైట్‌" అని తెలిపారు.

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రెట్రో’ సినిమా మే 1, 2025న విడుదలకు సిద్ధమైంది. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ డబ్బింగ్ పనులను సూర్య తాజాగా పూర్తిచేశారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ చిన్న వీడియోలో, డబ్బింగ్ స్టూడియో నుంచి సూర్య మాట్లాడుతూ "రెట్రో డబ్బింగ్ కట్ అండ్ రైట్‌" అని తెలిపారు. ఈ వీడియోతో పాటు, సూర్య-కార్తీక్ సుబ్బరాజ్, ట్రెండింగ్ స్టూడియో జిబ్లి ఏఐ ఎడిట్‌ను అభిమానులతో పంచుకున్నారు.

సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘రెట్రో’ సినిమా 1990ల నేపథ్యంలో ఒక గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలో ప్రేమ, వినోదం, పోరాటాన్ని చూపించేలా రూపొందింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే, జోజు జార్జ్, జయరాం, కరుణాకరన్, నాజర్, ప్రకాష్ రాజ్, సుజిత్ శంకర్ ముఖ్య పాత్రల్లో నటించగా, శ్రియా శరణ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

సూర్య స్వయంగా తన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సహ నిర్మిస్తుండగా, సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన రెండు సింగిల్స్‌కు మంచి స్పందన లభించింది. ఇటీవలే విడుదలైన ‘కనిమా’ పాట పెళ్లి నేపథ్యంలో రూపొందిన ఉత్సాహభరితమైన బీట్స్‌తో ఆకట్టుకుంటోంది. ‘రెట్రో’ సినిమాకు శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ, షఫీక్ మొహమ్మద్ అలీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Tags

Next Story