తమిళ చిత్రాలపైనే ఆశలన్నీ పెట్టుకున్న సందీప్ కిషన్ !

యంగ్ హీరో .. సందీప్ కిషన్ తన 30వ చిత్రంగా వచ్చిన “మజాకా” పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తన కెరీర్‌కు మైలురాయిగా నిలవాలని, మంచి విజయాన్ని అందించాలని భావించాడు. కానీ... ఆ సినిమా ఘోరంగా విఫలమైంది. “మజాకా” పరాజయం తర్వాత సందీప్ కిషన్ కు టాలీవుడ్‌లో కొత్త అవకాశాలు దొరకడం కష్టమయ్యేలా ఉంది. ప్రస్తుతం, అతడు రెండు వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానున్న “ది ఫ్యామిలీ మేన్ 3” లో ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలాగే, నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందుతున్న “సుబ్బు” వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నాడు.
తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు రాహుల్ యాదవ్ నక్కా తెరకెక్కిస్తున్న “వైబ్ ” అనే చిత్రంలో నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమా తర్వాత అతడి తదుపరి ప్రధాన తెలుగు ప్రాజెక్ట్ గురించి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, తమిళ సినీ పరిశ్రమలో మాత్రం సందీప్ కిషన్ మంచి అవకాశాలు దక్కించుకుంటున్నాడు.
ప్రముఖ హీరో దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ తన తొలి దర్శకత్వ చిత్రానికి సందీప్ కిషన్ ను కథానాయకుడిగా ఎంపిక చేశాడు. తమిళంలో వస్తున్న ఈ సినిమాలపైనే అతడు భారీగా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికీ తెలుగు సినిమాల్లో అతని స్థానం కాస్త సందిగ్ధంలో ఉన్నా, తమిళ పరిశ్రమలో అతనికి కొత్త అవకాశాలు అందుబాటులోకి రావడం అతడి కెరీర్‌కు ఇది శుభ సూచకమనే చెప్పాలి.
-
Home
-
Menu