అజిత్ కు జోడీగా ‘కేజీఎఫ్’ బ్యూటీ?

‘కేజీఎఫ్’ సిరీస్ సినిమాలతో సినీ లవర్స్‌ను ఫిదా చేసిన శ్రీనిధి శెట్టి, తెలుగు సినిమా ‘హిట్ 3’తో తన టాలెంట్‌ను మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఈ బ్యూటీ గతంలో తమిళ సినిమా ‘కోబ్రా’తో కోలీవుడ్‌లో తన లక్ టెస్ట్ చేసుకుంది కానీ, ఆ సినిమా ఆశించిన సక్సెస్‌ను అందుకోలేకపోయింది. అయినా సరే, శ్రీనిధి మళ్లీ తమిళ సినిమా ఇండస్ట్రీలో రీ-ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోందని లేటెస్ట్ బజ్.
తమిళ స్టార్ హీరో అజిత్, డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌తో మరో బిగ్ ప్రాజెక్ట్ కోసం జోడీ కడుతున్నాడు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న సెకండ్ మూవీ ఇది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌లో ఫుల్ బిజీగా ఉన్న ఈ సినిమా, నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయనుందని ఇన్‌సైడ్ టాక్. ఈ క్రమంలోనే ఈ బిగ్ బడ్జెట్ మూవీలో హీరోయిన్ రోల్ కోసం శ్రీనిధి శెట్టిని కన్సిడర్ చేస్తున్నారని హాట్ న్యూస్. చిత్ర యూనిట్ ఇప్పటికే ఆమెతో డిస్కషన్స్ స్టార్ట్ చేసినట్లు సమాచారం.
ఈ సినిమా అజిత్ స్టైల్‌కు మ్యాచ్ అయ్యేలా ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని టాక్ నడుస్తోంది. హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్, అజిత్ స్వాగ్‌తో పాటు గ్రిప్పింగ్ స్టోరీ లైన్‌తో ఈ మూవీ ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ అవుతుందని అంటున్నారు. నిర్మాణ సంస్థ వివరాలతో సహా మరిన్ని డీటెయిల్స్ త్వరలో అఫీషియల్‌గా అనౌన్స్ కానున్నాయి. ఇదిలా ఉంటే, శ్రీనిధి శెట్టి ప్రస్తుతం తెలుగులో స్టైలిష్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డతో ‘తెలుసు కదా’ సినిమాలో జోడీగా నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్‌ను మరోసారి ఇంప్రెస్ చేసేందుకు రెడీ అవుతోంది.
-
Home
-
Menu