శ్రీలీల తొలి తమిళ చిత్రం ఇదే !

కన్నడ సినిమాల ద్వారా తన సినీ కెరీర్ ప్రారంభించిన అందాల శ్రీలీల... కొద్ది కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి కథానాయికగా ఎదిగింది. తెలుగులో పలు భారీ చిత్రాల్లో నటించిన అనంతరం... ఆమె ప్రస్తుతం తమిళంలో తొలి అడుగులు వేస్తోంది. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పరాశక్తి” చిత్రంలో శ్రీలీల ప్రధాన కథానాయికగా నటిస్తోంది.
సూర్య నటించిన “ఆకాశం నీ హద్దురా”, వెంకటేష్ హీరోగా వచ్చిన “గురు” వంటి విజయవంతమైన చిత్రాలను సుధా కొంగర రూపొందించిన సంగతి తెలిసిందే. ‘పరాశక్తి’ చిత్రంలో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తుండగా.. ఇది అతడి కెరీర్‌లో 25వ చిత్రం. లేటెస్ట్ గా చిత్రబృందం సినిమా టైటిల్‌ను, టీజర్‌ను విడుదల చేసింది.
పీరియాడికల్ నేపథ్యంలో మద్రాస్ బ్యాక్ డ్రాప్ గా రూపొందుతున్న ఈ సినిమా.. విద్యార్థి రాజకీయాలపై సెంట్రల్ పాయింట్ గా ఉంటుంది. ఇందులో అథర్వ, శ్రీలీల, రవి మోహన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టీజర్ చివర్లో.. కళాశాల భవనంపై నిలబడి శివకార్తికేయన్ "విప్లవం అవసరం" అంటూ పిలుపునిచ్చే దృశ్యం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. శ్రీలీల ప్రస్తుతం తమిళంతో పాటు బాలీవుడ్‌లో కూడా తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. ఈ సినిమా శ్రీలీలకు తమిళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం ఖాయం!
-
Home
-
Menu