‘కిల్లర్’ గా అదరగొడుతున్న యస్.జే.సూర్య !

‘కిల్లర్’ గా అదరగొడుతున్న యస్.జే.సూర్య !
X
పోస్టర్‌లో ఎస్‌జే సూర్య స్టైలిష్ బ్లాక్ సూట్‌లో కనిపిస్తూ, ప్రీతి అస్రానీని భుజంపై ఎత్తుకుని, ఒక చేతిలో గన్ పట్టుకుని ఉన్నాడు. ప్రీతి అస్రానీ చేతిలో రోజాల బొకే ఉండటం పోస్టర్‌ను మరింత ఆసక్తికరంగా మార్చింది.

కోలీవుడ్ విలక్షణ నటుడు, దర్శకుడు ఎస్‌జే సూర్య ఒక పాన్-ఇండియా థ్రిల్లర్ చిత్రం "కిల్లర్"తో దర్శకుడిగా తిరిగి రంగంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ చిత్రంలో యువ నటి ప్రీతి అస్రానీ కీలక పాత్రలో నటిస్తుండగా.. ఎస్‌జే సూర్య హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్‌జే సూర్య పుట్టినరోజు సందర్భంగా "కిల్లర్" టీమ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.

పోస్టర్‌లో ఎస్‌జే సూర్య స్టైలిష్ బ్లాక్ సూట్‌లో కనిపిస్తూ, ప్రీతి అస్రానీని భుజంపై ఎత్తుకుని, ఒక చేతిలో గన్ పట్టుకుని ఉన్నాడు. ప్రీతి అస్రానీ చేతిలో రోజాల బొకే ఉండటం పోస్టర్‌ను మరింత ఆసక్తికరంగా మార్చింది. ఈ నేపథ్యంలో బిఎండబ్ల్యూ కారు, పోస్టర్ అంతటా కనిపించే ఎరుపు రంగు ఈ చిత్రం పట్ల ఉత్కంఠను పెంచాయి.

ఎస్‌జే సూర్య తన ప్రొడక్షన్ హౌస్ ఏంజెల్ స్టూడియోస్‌తో పాటు, గోకులం గోపాలన్ శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌తో కలిసి "కిల్లర్" ను నిర్మిస్తున్నాడు. లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన భాషలతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది.


Tags

Next Story