కోల్డ్ వార్ ఇంకా కొనసాగుతోందా?

కోల్డ్ వార్ ఇంకా కొనసాగుతోందా?
X
ప్రముఖ సీనియర్ నటి జ్యోతిక, సిమ్రన్‌ల మధ్య కోల్డ్ వార్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఇటీవల జరిగిన జేఎఫ్ డబ్ల్యూ మూవీ అవార్డ్స్ కార్యక్రమంలో సిమ్రన్ ఓ సంఘటనను గుర్తు చేసుకుంది. అది తనను బాధించిందని చెప్పింది. ఓ సహనటి తనపై దూషణాత్మక వ్యాఖ్య చేసిందని సిమ్రన్ పేర్కొంది.

చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు నటీనటుల మధ్య కోల్డ్ వార్స్, విచిత్రమైన పరిస్థితులు ఏర్పడటం సర్వ సాధారణం. ఇదే పరిస్థితి తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ సీనియర్ నటి జ్యోతిక, సిమ్రన్‌ల మధ్య ఉన్నట్టు అనిపిస్తోంది. ఇటీవల జరిగిన జేఎఫ్ డబ్ల్యూ మూవీ అవార్డ్స్ కార్యక్రమంలో సిమ్రన్ ఓ సంఘటనను గుర్తు చేసుకుంది. అది తనను బాధించిందని చెప్పింది. ఓ సహనటి తనపై దూషణాత్మక వ్యాఖ్య చేసిందని సిమ్రన్ పేర్కొంది.

"కనీసం ఆంటీ పాత్రలు చేసే పరిస్థితి మాత్రం రాలేదు," అని ఆవిడ అన్నదని సిమ్రాన్ చెప్పింది. ఈ వ్యాఖ్య తనను ఎంతగానో బాధించిందని సిమ్రన్ పేర్కొంది. తాను ఎప్పుడూ తన పాత్రలను గౌరవంతో స్వీకరించానని, పెద్దవైనా చిన్నవైనా ప్రతి పాత్రను గర్వంగా స్వీకరించి నటించానని ఆమె వివరించింది. అలాగే, "ఆంటీ" అని పిలవడం హేళనగా చూడకూడదని.. వయస్సు పెరిగేకొద్దీ పాత్రలు మారడం సహజమేనని, దాన్ని గౌరవంతో అంగీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

సిమ్రన్ తన అనుభవాన్ని పంచుకున్న తర్వాత.. చాలా మంది అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు. సీనియర్ నటుల పట్ల గౌరవాన్ని కాపాడుకోవాలన్న చర్చలు ఈ ఘటన తర్వాత మళ్ళీ ఊపందుకున్నాయి. మొత్తానికి, జ్యోతిక - సిమ్రన్ మధ్య ఈ అపార్థం ఇప్పుడు తమిళ చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది. ఈ సున్నితమైన అంశంపై ఎవరి పక్షాన నిలబడాలన్న దిశలో ప్రేక్షకులు, అభిమానులు కూడా అయోమయానికి లోనవుతున్నారు.

Tags

Next Story