సిమ్రాన్ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి?

జెఎఫ్ డబ్ల్యూ మూవీ అవార్డ్స్ కార్యక్రమంలో నిన్నటి తరం క్రేజీ హీరోయిన్ సిమ్రాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ కార్యక్రమం నిర్వాహకులు ఆమె ప్రసంగం వీడియోను పంచుకోగా.. తర్వాత సిమ్రాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేసింది. దాంతో నెటిజన్లు.. సిమ్రాన్ ఎవరి మీద ఈ వ్యాఖ్యలు చేసింది అన్న విషయం మీద ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ ప్రసంగంలో సిమ్రాన్ మాట్లాడుతూ.. తాను ఒక సమకాలీన హీరోయిన్‌కు మెసేజ్ చేసి.. ఆమె ఒక తాజాగా చేసిన ప్రాజెక్టులో ఆ పాత్ర ఎందుకు తీసుకున్నావని అడిగానని చెప్పింది. దానికి ఆ నటి ఇచ్చిన సమాధానాన్ని సిమ్రన్ వెల్లడిస్తూ.. "ఆంటీ పాత్రలకంటే ఇలాంటి పాత్రలు చేయడమే మంచిదని" ఆమె చెప్పినట్లు పేర్కొంది.
ఈ వ్యాఖ్యపై సిమ్రన్ అసహనం వ్యక్తం చేసింది. ఆమె చెప్పిన మాటలు.. "ఆంటీ పాత్రలు చేయడం బాగుండదా? డబ్బా పాత్రలు చేసుకోవడమే బెటరా?" అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టం చేసిందట. ‘నేను ఆంటీ పాత్రలు, తల్లి పాత్రలు చేయడానికే సిద్ధం. ప్రతి వయసు దశలో నేను మహిళగా ఉండడాన్ని గౌరవించాను. నేను చేసే పాత్రలు కూడా దాన్నే ప్రతిబింబిస్తాయి. అది ఆంటీ పాత్రైనా, తల్లి పాత్రైనా, మరేదైనా అని చెప్పింది.
సిమ్రన్ ఉపయోగించిన "డబ్బా" అనే పదం కీలక సూచనగా మారింది. చాలా మంది నెటిజన్లు.. ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ 'డబ్బా కార్టెల్' లో నటించిన జ్యోతికను ఉద్దేశించే సిమ్రన్ వ్యాఖ్యానించిందని భావిస్తున్నారు మరికొందరు మాత్రం.. ఇది త్రిష లేదా ఇటీవల ‘గోట్’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన లైలా పై వ్యాఖ్య అయి ఉండొచ్చని ఊహిస్తున్నారు. ప్రస్తుతం వరకు సిమ్రాన్ ఎవరి పేరు స్పష్టంగా చెప్పలేదు. అయితే, అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ఇదే చర్చిస్తూ.. ఎవరిని ఉద్దేశించి సిమ్రన్ విమర్శించిందో తెలుసుకోవాలని ఉత్సాహంగా చర్చిస్తున్నారు.
-
Home
-
Menu