ఆ డైరెక్టర్ తో శింబు చిత్రం !

ఆ డైరెక్టర్ తో శింబు చిత్రం !
X

ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ చిత్రంతో దర్శకుడు అశ్వత్ మరిముత్తు భారీ విజయాన్ని సాధించిన తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి సారిస్తున్నాడు. శింబు హీరోగా రూపొందనున్న ఈ చిత్రం ప్రస్తుతం యస్టీఆర్ 51 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోతోంది. ఈ మధ్య జరిగిన ఓ సినీ ఈవెంట్‌లో దర్శకుడు మాట్లాడుతూ..





ఈ నెలాఖరుకల్లా చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయని.. కథా నిర్మాణం పూర్తయిందని తెలిపారు. 2026 సమ్మర్‌లో విడుదల చేయాలని అనుకుంటున్నాం.. అని వెల్లడించారు. ఈ చిత్రం ఎలా ఉండబోతుందనే ప్రశ్నకు అశ్వత్ మరిముత్తు స్పందిస్తూ, "ఓ మై కడవుళే, డ్రాగన్" సినిమాల్లోని మేజిక్‌తో పాటు శింబు సినిమాల్లో అభిమానులు కోరుకునే అంశాలు కూడా ఇందులో ఉంటాయి అని చెప్పారు.

ప్రదీప్ రంగనాథన్, కయాదు లోహార్, అనుపమ పరమేశ్వరన్, మిస్కిన్, వీజే సిద్ధు, హర్షత్ ఖాన్ ప్రధాన పాత్రలలో నటించిన డ్రాగన్ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసి ఘనవిజయం సాధించింది. మరి కోలీవుడ్ లో శింబుకున్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుంటే.. దర్శకుడు అంతకన్నా ఎక్కువగానే ఈ సినిమాతో అత్యధిక వసూళ్ళను రాబట్టాలి. మరి శింబుతో అతడు ఎలాంటి సినిమాను అందిస్తాడో చూడాలి.

Tags

Next Story