సిద్ధార్ధ్- శరత్ కుమార్ ‘3 బీహెచ్ కే’

సిద్ధార్ధ్- శరత్ కుమార్ ‘3 బీహెచ్ కే’
X
శ్రీ గణేష్ ముందుగా ‘8 తోట్టాక్కల్’, ‘కురుది ఆటం’ వంటి సినిమాలను రూపొందించినప్పటి నుంచే మంచి క్రియేటివ్ దర్శకుడిగా గుర్తింపు పొందాడు.

సిద్ధార్థ్, శ్రీ గణేష్ కాంబినేషన్‌లో రూపొందిన వెరైటీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘3 బీహెచ్ కే ’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 4న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వా నిర్మిస్తున్నారు. శ్రీ గణేష్ ముందుగా ‘8 తోట్టాక్కల్’, ‘కురుది ఆటం’ వంటి సినిమాలను రూపొందించినప్పటి నుంచే మంచి క్రియేటివ్ దర్శకుడిగా గుర్తింపు పొందాడు.

ఈ చిత్రంలో సిద్ధార్థ్ పేరెంట్స్ గా శరత్ కుమార్, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా యోగిబాబు, మీథా రఘునాథ్, చైత్ర ఆచార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే.. కన్నడ హిట్ చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో సైడ్ బీ’ లో చక్కటి నటనతో మెప్పించిన చైత్ర ఆచార్ ఈ చిత్రంతో తమిళ తెరపైకి అడుగుపెడుతోంది.

‘మావీరన్’ వంటి విజయవంతమైన సినిమాను నిర్మించిన శాంతి టాకీస్ బ్యానర్, ప్రస్తుతం విక్రమ్ హీరోగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘చియాన్ 63’ అనే చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో... ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో ఆసక్తికరంగా తెరకెక్కుతున్న ‘3 బీహెచ్ కే ’ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Tags

Next Story