బంపరాఫర్ అందుకుంది !

యువ నటి శివాని రాజశేఖర్ సినిమాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. నలుపు-నీలి రంగు ఫ్లోరల్ కట్‌అవుట్ డ్రెస్‌లో శివాని ఒదిగిపోయింది. స్లీవ్‌లెస్ డిజైన్, స్టైలిష్ ఫ్రిల్స్ కలిగి ఉన్న ఆ డ్రెస్ ఆమె అందాన్ని మరింత వెలిగించింది.
సీనియర్ నటులు డాక్టర్ రాజశేఖర్, జీవితల కూతురైన శివాని ఇప్పటికే ‘అద్భుతం’, ‘విద్యా వాసుల అహం’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె కెరీర్‌లో ఒక పెద్ద అవకాశం లభించింది. రైతు, పరిశోధకుడు, సాంకేతిక నిపుణుడు అయిన జీడి నాయుడు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ "జీడీయన్" లో శివాని ఓ కీలక పాత్ర పోషించనుంది.
ఈ చిత్రాన్ని క్రిష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. జూన్ 2025 నుంచి శివాని షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. ఈ అవకాశం శివానికి కెరీర్ పరంగా ఎంతో కీలకమైంది. అర్థవంతమైన కథా నేపథ్యం కలిగిన సినిమాలో మాధవన్ వంటి సీనియర్ నటుడితో స్క్రీన్ షేర్ చేయడం ద్వారా శివానికి విస్తృతమైన గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌తో ఆమె మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిద్దాం.
-
Home
-
Menu