శివకార్తికేయన్ ‘మదరాసి’ విడుదలయ్యేది అప్పుడే !

శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మదరాసి’. ఈ మూవీ ఈ ఏడాదే థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. విడుదల తేదీ పోస్టర్‌ను పంచుకుంటూ, “ది డేట్ ఈజ్ లాక్‌డ్ ఫర్ ది అల్టిమేట్ యాక్షన్! మాడ్ అండ్ మాస్సీ రైడ్ ఆఫ్ ‘మదరాసి’. ఈ సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మీ ముందుకు రాబోతోంది..” అని పేర్కొన్నారు.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శివకార్తికేయన్ తో పాటు రుక్మిణి వసంత్, బిజు మీనన్, విద్యుత్ జమ్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గతంలో విజయ్‌తో చేసిన ‘కత్తి’ తర్వాత మురుగదాస్-అనిరుధ్ కాంబినేషన్‌కి ఇది మళ్లీ రీ-యూనియన్ కావడం విశేషం.
ఇక శివకార్తికేయన్ తదుపరి చిత్రం ‘పరాశక్తి’. సుధా కాంగరా డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. ఇది ఓ పీరియడ్ డ్రామాగా రూపొందుతుండగా.. ఇందులో రవి మోహన్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రం హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో సాగనుందని సమాచారం. తమిళంలో తొలిసారి శ్రీలీలా నటిస్తుండగా, అథర్వ మురళి కూడా కీలక పాత్ర పోషించనున్నారు. ఈ తరహా వరుస ప్రాజెక్టులతో శివకార్తికేయన్ కెరీర్ మరింత ఉత్సాహంగా, వైవిధ్యభరితంగా కొనసాగుతోంది. ‘మదరాసి’తో ఆయన మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటతాడని అభిమానులు ఆశిస్తున్నారు.
The date is locked for the ultimate action 🎯
— Sri Lakshmi Movies (@SriLakshmiMovie) April 14, 2025
The Mad and Massy ride of #Madharasi is coming - from September 5th in theatres worldwide 🔥#Madharasi / #DilMadharasi IN CINEMAS WORLDWIDE SEPTEMBER 5th ❤🔥#MadharasiFromSep5#SK23@Siva_Kartikeyan @ARMurugadoss… pic.twitter.com/uNGpVF2GmZ
-
Home
-
Menu