శరత్ కుమార్, శశికుమార్, భరత్ తమిళ చిత్రం

శరత్ కుమార్, శశికుమార్, భరత్ తమిళ చిత్రం
X

శరత్ కుమార్, శశికుమార్, భరత్ తమిళ చిత్రంశరత్ కుమార్, శశికుమార్, భరత్ తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను కొత్త దర్శకుడు ఎం.గురు తెరకెక్కిస్తున్నారు. కుటుంబ బంధాలు, అనుబంధాలను ప్రధానంగా చూపించే ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో మేఘా శెట్టి, మాళవిక కథానాయికలుగా పరిచయం అవుతున్నారు. అలాగే ఎమ్. ఎస్. భాస్కర్, ఆడుకళాం నరేన్, ఇందుమతి, జో మల్లోరి, కన్జా కరుప్పు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు గురు గతంలో ప్రఖ్యాత దర్శకుడు ఎరా శరవణన్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు.

ఈ చిత్రానికి ఎస్.ఆర్. సతీష్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎన్.ఆర్. రఘునాథన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలను కూడా గురు స్వయంగా రచిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మార్చి 10న ప్రారంభమై, ఒకే షెడ్యూల్‌లో పూర్తవ్వనుంది. చిత్రీకరణను పట్టు కోట్టై, మన్నార్గుడి, ముతుపెట్టై, వేదారణ్యం, తంజావూర్ ప్రాంతాల్లో జరపనున్నారు. జాంబరా ఎంటర్టైన్మెంట్ పతాకంపై ధర్మరాజ్ వేలుసామి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మిగతా సాంకేతిక బృంద వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Tags

Next Story