అద్భుతమైన సినిమా ‘తుడరుమ్’ : సెల్వరాఘవన్

మోహన్‌లాల్ లేటెస్ట్ థియేట్రికల్ హిట్ 'తుడరుమ్' ఓటీటీలో ప్రీమియర్ అయిన తర్వాత, ఫిల్మ్‌మేకర్, నటుడు సెల్వరాఘవన్ ఈ సినిమాను చూసి తన రివ్యూ రాసుకొచ్చాడు. ఎక్స్‌లో ఓ చిన్న పోస్ట్‌లో.. ఈ దర్శక, నటుడు సినిమాను మెచ్చుకుంటూ, మోహన్‌లాల్‌ను భారతదేశంలోనే బెస్ట్ యాక్టర్ అని కొనియాడాడు.
“అద్భుతం.. అద్భుతమైన సినిమా ‘తుడరుమ్’. ఈ సినిమాలో మోహన్‌లాల్ సార్ మాత్రమే అద్భుతంగా చేయగలరు. ఎంతో గొప్పనటుడు ఆయన. భారతదేశంలోని ఆ బెస్ట్ యాక్టర్ నటనకు మంత్రముగ్ధుడినయ్యాను..” అని రాసాడు.
తరుణ్ మూర్తి డైరెక్షన్లో తెరకెక్కిన 'తుడరుమ్' ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ అయి, మే 30న జియోహాట్‌స్టార్‌లో ప్రీమియర్ అయింది. ఈ చిత్రంలో శోభన, ప్రకాశ్ వర్మ, ఫర్హాన్ ఫాసిల్, మణియన్‌పిళ్ల రాజు, బిను పప్పు, ఇర్షాద్ అలీ, ఆర్ష చాందిని బైజు తదితరులు నటించారు. ఈ సినిమా ప్రస్తుతం మలయాళంలో మూడో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
Brilliant Brilliant movie * Thudarum * is ! Only @Mohanlal sir can pull of this film! What an actor! Mesmerised by the best actor in india!
— selvaraghavan (@selvaraghavan) June 3, 2025
-
Home
-
Menu