ఆకట్టుకుంటున్న సముద్రఖని లుక్ !

దుల్కర్ సల్మాన్ నటించనున్న తదుపరి చిత్రం ‘కాంత’. ప్రస్తుతం ఈ సినిమా అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. దుల్కర్ సల్మాన్ స్వయంగా వేఫరర్ ఫిలింస్ బ్యానర్‌పై, రానా దగ్గుబాటి తో కలిసి స్పిరిట్ మీడియా బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది.
ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. బ్లాక్ అండ్ వైట్ టోన్‌లో విడుదలైన ఈ పోస్టర్‌లో సముద్రఖని పాత్ర పీరియడ్ డిజైన్‌లో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన తీక్షణమైన చూపు, తీవ్రమైన భావవ్యక్తీకరణ చిత్రానికి మరింత గంభీరతను తెచ్చిపెడుతోంది. ఈ పాత్ర చిత్రంలో ఎంతో కీలకమైందని ఈ పోస్టర్ చెబుతోంది.
ఈ చిత్రానికి డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ అందించగా, సంగీతాన్ని ఝాను సమకూర్చుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. 'కాంత' అన్ని దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. దుల్కర్, రానాల కలయిక, గంభీరమైన కథనశైలి, మరియు టెక్నికల్ టీమ్ పరిశ్రమలో మంచి అంచనాలు నెలకొల్పాయి.
-
Home
-
Menu