22 ఏళ్ళ తర్వాత మళ్లీ ఈ ఇద్దరా?

తమిళ దళపతి విజయ్ మోస్ట్ అవైటింగ్ చిత్రం ‘జన నాయగన్’. ఈ మూవీ చుట్టూ ఉత్కంఠ రేపే వార్తలు ఊపందుకున్నాయి. ప్రముఖ నటి రేవతి ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్. పరిశ్రమలోని సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం... రేవతి ఈ చిత్రంలో విజయ్ తల్లి పాత్రను పోషించ నున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం కొడైకానల్లోని సుందరమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.
ప్రస్తుతం ఈ వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది ఒకవేళ ఈ వార్త నిజమైతే.. ఇది విజయ్, రేవతి మధ్య రెండు దశాబ్దాల తర్వాత జరిగే రీ యూనియన్‌గా ‘జననాయగన్’ చిత్రం నిలుస్తుంది. ఈ ఇద్దరూ చివరిసారిగా 2002లో విడుదలైన ‘తమిళన్’ చిత్రంలో కలిసి నటించారు. అందులో రేవతి విజయ్ సోదరి పాత్రలో మెప్పించారు. ఇప్పుడు, తల్లి-కొడుకు జోడీగా వారు తెరపై కనిపించనున్నారనే ఊహాగానాలు అభిమానుల్ని ఖుషీ చేస్తున్నాయి.
రేవతి, తన అసాధారణ నటనతో కోలీవుడ్ లో తనదైన స్థాయిలో గుర్తింపు సాధించిన నటి. ఆమె చివరిసారిగా 2022లో విడుదలైన ‘తిరుచిత్రంబళం’ చిత్రంలో ఒక చిన్న కామియో పాత్రలో కనిపించారు. ఆమె ప్రతి పాత్రకు తీసుకొచ్చే ఎమోషనల్ డెప్త్, నేచురాలిటీ ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. జన నాయగన్ చిత్రంలో ఆమె పూర్తిస్థాయి పాత్రలో తిరిగి రావడం, ముఖ్యంగా విజయ్ తల్లి పాత్రలో నటించడం.. చిత్ర కథాంశానికి భావోద్వేగ బలాన్ని జోడిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్నాడు.
విజయ్.. తన సినీ కెరీర్‌ను ముగించి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న తరుణంలో.. ఈ చిత్రం అతడి కెరీర్లో ఒక మైలురాయిగా ఒక శక్తివంతమైన స్టేట్మెంట్గా భావిస్తున్నారు. అభిమానులు ఈ చిత్రాన్ని విజయ్ సినీ ప్రయాణంలో ఒక గొప్ప వీడ్కోలుగా చూస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ప్రియమణి, పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మమిత బైజు, మరియు నారాయణ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
-
Home
-
Menu