రెండు భారీ ప్రాజెక్టులతో రెజీనా కసాండ్ర!

అజిత్ హీరోగా నటించిన ‘విడాముయార్చి’ చిత్రంలో తన అద్భుతమైన అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్న రెజీనా కసాండ్రా.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘మూకుత్తి అమ్మన్ 2’ లో నటిస్తున్నట్లు ప్రకటించింది. సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి చెన్నైలో పూజా కార్యక్రమాలతో అధికారికంగా శ్రీకారం చుట్టారు.
ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రెజీనా.. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. “లైట్స్, కెమెరా ఆండ్... మూకుత్తి అమ్మన్ 2. ఈ రోజు నా జీవితంలో ఓ మధురమైన క్షణాన్ని ఆస్వాదించాను. నాకు చాలా అరుదుగా మాత్రమే అటువంటి గౌరవం లభిస్తుంది, ప్రత్యేకంగా మహిళా శక్తితో నిండిన సెటప్‌లో.. అగ్రశ్రేణి నటీనటులతో కలిసి నిలబడి నా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం నిజంగా సంతోషంగా ఉంది. మీ ప్రేమకు మరోసారి కృతజ్ఞతలు.. త్వరలో తెరపై కలుద్దాం.. అంటూ రెజీనా ఎమోషనల్ పోస్ట్ చేసింది.
ఈ రెండు చిత్రాల్లో రెజీనా పూర్తిగా భిన్నమైన పాత్రలు పోషించనుండటం విశేషం. ‘మూకుత్తి అమ్మన్ 2’ లో ఆధ్యాత్మికత, వినోదం మేళవిన పాత్ర చేస్తుండగా.. ‘జాట్’ లో మాత్రం ఆమె ఇంటెన్స్, భావోద్వేగపూరిత నటన ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలు ఆమె కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచే అవకాశం ఉండటంతో, రెజీనా అభిమానులు ఆమె కొత్త పాత్రలను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
-
Home
-
Menu