ఖరీదైన చిత్రాల లిస్ట్ లోకి రజనీకాంత్ ‘కూలీ’

ఖరీదైన చిత్రాల లిస్ట్ లోకి రజనీకాంత్ ‘కూలీ’
X
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘కూలీ’ సినిమా ఏకంగా రూ. 375 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. దీంతో ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఈ సినిమా ఒక టాక్‌గా మొదలై.. ఇప్పుడు భారతీయ సినిమా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘కూలీ’ సినిమా ఏకంగా రూ. 375 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. దీంతో ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు ఆమిర్ ఖాన్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, పూజా హెగ్డేలాంటి స్టార్ కాస్ట్ ఉంది. రజనీకాంత్ ఒక్కరే రూ. 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా. లోకేష్ డైరెక్షన్ కోసం రూ. 50 కోట్లు అందుకుంటున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న వివిధ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ద్వారా రూ. 240 కోట్లు రికవరీ అయ్యాయి.

సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే థియేట్రికల్ రెవెన్యూగా రూ. 135 కోట్లు, మొత్తం గ్లోబల్ కలెక్షన్స్‌గా రూ. 400 కోట్లు రావాలి. మొదట రూ. 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ పెట్టుకున్నా.. ‘వార్ 2’ లాంటి సినిమాల నుంచి గట్టి పోటీ ఉండటంతో టీమ్ ఆ లక్ష్యాన్ని రియలిస్టిక్ ఫిగర్‌కి సవరించింది.

బాక్సాఫీస్ విజయం ఎక్కువగా తెలుగు, హిందీ మార్కెట్లపై ఆధారపడి ఉంది. ఇండస్ట్రీ ట్రాకర్స్ అంచనా ప్రకారం తెలుగు నుంచి రూ. 60 కోట్లు, హిందీ నుంచి రూ. 30–40 కోట్లు రావొచ్చు. రికార్డులు బద్దలు కొట్టినా కొట్టకపోయినా, ‘కూలీ’ చిత్రం.. దాని స్కేల్, అంబిషన్‌తో ఇప్పటికే ఈ ఏడాది మోస్ట్ హైప్డ్ రిలీజ్‌లలో ఒకటిగా నిలిచింది.

Tags

Next Story