దుబాయ్ లో రజనీకాంత్ దంపతులు హల్ చల్ !

సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన సతీమణి లత దుబాయిలో హల్ చల్ చేశారు. అక్కడే వారు తమ 44వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో రజనీకాంత్, లతను అభిమానులు కలిసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ‘కూలీ’ చిత్రీకరణలో ఉన్న రజనీకాంత్, తన భార్యతో సమయం గడిపేందుకు కొన్ని రోజులు విరామం తీసుకున్నారు.
దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో కొంతమంది అభిమానులు ఆయనను కలసి, ఫోటోలు దిగిన ఆనందాన్ని పొందారు. నేవీ-బ్లూ పోలో టీ షర్ట్, గ్రే ధోతి ప్యాంట్ ధరించిన రజనీకాంత్, అభిమానులకు చిరునవ్వుతో అభివాదం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో నుంచి బయటకు వెళ్లేందుకు ఆయన తన భార్యతో కలిసి బగ్గీలో ప్రయాణించారు. అక్కడ ఆయనను చూసిన అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. రజనీకాంత్, లత 1981 లో వివాహం చేసుకున్నారు. ఈ సంవత్సరం వారు 44వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. అయితే, వారి ఆ వేడుకల ఫోటోలు ఇంకా బయటకు రాలేదు.
ఇక సినిమాల విషయానికొస్తే .. రజనీకాంత్ చివరగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ‘వేట్టయన్’ చిత్రంలో నటించారు. ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకుంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు. మొదట ఈ సినిమా 2025 సమ్మర్‌లో విడుదల కానుందని ప్రచారం జరిగినా, తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో థియేటర్లలో విడుదల చేయాలని చూస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ‘కూలీ’ పూర్తయిన తర్వాత, రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘జైలర్ 2’ చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఇటీవల ఈ సీక్వెల్‌కు సంబంధించిన ప్రోమో విడుదలై అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది
-
Home
-
Menu