సామాన్య విమానంలో చెన్నైకి ప్రయాణించిన తలైవా!

సామాన్య విమానంలో చెన్నైకి ప్రయాణించిన తలైవా!
X
విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్ల నడుమ తలైవా ఎంట్రీ ఇవ్వగానే విమాన ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఆయన సొంతంగా రూ.8 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌ కలిగి ఉన్నా కూడా, సామాన్య విమానంలో ప్రయాణించడం ఆయన వినమ్రతకు నిదర్శనం.

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ‘జైలర్ 2’ షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన సామాన్య ప్రజలతో పాటు ఓ ఎకానమీ విమానంలో ప్రయాణించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్ల నడుమ తలైవా ఎంట్రీ ఇవ్వగానే విమాన ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఆయన సొంతంగా రూ.8 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌ కలిగి ఉన్నా కూడా, సామాన్య విమానంలో ప్రయాణించడం ఆయన వినమ్రతకు నిదర్శనం.

వీడియోలో రజనీ ఫ్యాన్స్ హర్షధ్వానాలు చేయగా.. తలైవా వారికి నవ్వుతూ అభివాదం చేశారు. అనంతరం తన సీటుకు వెళ్లి కూర్చున్నారు. తన సాదా జీవనశైలి, నెమ్మదిగా వ్యవహరించడం మరొకసారి అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రయాణం ‘జైలర్ 2’ చిత్ర షూటింగ్ షెడ్యూల్ పూర్తయ్యాక చెన్నైకి తిరిగి వస్తున్న సమయంలో జరిగింది.

ఈలోగా, రజనీకాంత్‌ కేరళలోని 400 ఏళ్ల పురాతనమైన మతేశ్వరన్ శివాలయాన్ని సందర్శించిన వీడియో కూడా వైరల్ అయింది. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న తలైవాను ఆలయ అధికారులు ఆత్మీయంగా స్వాగతించారు. ఆయన అనంతరం ఆలయ ప్రాంగణంలోకి వెళ్లి దర్శనం చేసుకున్నారు.

Tags

Next Story