కాలంతో పోటీ పడుతున్న సూపర్ స్టార్ !

కాలంతో పోటీ పడుతున్న సూపర్ స్టార్ !
X
ఈ వయసులో కూడా రజినీకాంత్ చూపిస్తున్న స్పీడ్, ఎనర్జీ, డెడికేషన్ యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

ఇప్పటి హీరోలు సంవత్సరానికి ఒకటి లేదా రెండే సినిమాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. అయితే ఒకప్పుడు స్టార్ హీరోలు ఏకంగా ఆరు సినిమాలకుపైగా చేయడం సాధారణమే. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అయితే ఈ జాబితాలో రజినీకాంత్ లేరు. ఈ వయసులో కూడా ఆయన తన స్టైలే వేరు అని నిరూపించుకుంటున్నారు.

తాజాగా.. మాస్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కూలీ' షూటింగ్‌ను రజినీకాంత్ మార్చి 18న పూర్తి చేశారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. అయితే, ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా 'జైలర్ 2' సెట్స్‌లో అడుగుపెట్టారు రజినీకాంత్. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

ఈ సందర్భంగా కార్తీక్ సుబ్బరాజ్ పుట్టినరోజు వేడుకను జైలర్ 2 సెట్స్‌లో జరిపారు. దీనికి సంబంధించిన ఫోటోను లోకేశ్ కనగరాజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వయసులో కూడా రజినీకాంత్ చూపిస్తున్న స్పీడ్, ఎనర్జీ, డెడికేషన్ యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక 'కూలీ' 2025 ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Tags

Next Story