‘రెట్రో’ సినిమా నాకు చాలా ప్రత్యేకం : పూజాహెగ్డే

అభిమానులు ఆశించని విధంగా.. తన కెరీర్‌లో అత్యంత గర్వపడే చిత్రంగా పూజా హెగ్డే ‘రెట్రో’ను ఎంపిక చేసుకుంది. హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రం గురించి ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. పూజా మాట్లాడుతూ, "నా ప్రతి చిత్రానికీ గర్వపడుతాను, కానీ ‘రెట్రో’ నాకు చాలా ప్రత్యేకం. ఆ సినిమా చిత్రీకరణ విధానం.. సెట్స్‌పై ఉన్న శక్తి, మొత్తం సినిమా అద్భుతం అనిపించాయి. నా పాత్ర ఎంతో బాగా రూపుదిద్దుకుంది. ఇంకా పూర్తి సినిమా చూడలేదు. కానీ ఇప్పటివరకు చేసినదానిపై నాకు చాలా సంతృప్తి ఉంది" అని తెలిపింది.
ఈ చిత్రంలో తనను ఎంపిక చేయడానికి కారణం ‘రాధే శ్యామ్’ లో తన భావోద్వేగపూరిత నటనను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మెచ్చుకోవడమేనని పూజా వెల్లడించింది. సూర్య గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్న ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ప్రేమ కోసం అతను చేసిన త్యాగమే కథా నేపథ్యంగా ఉండనుంది. పూజా హెగ్డే ఇప్పటికే ‘రెట్రో’ షూటింగ్‌ను పూర్తిచేసింది. అయితే, ‘జన నాయకన్’ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఇంకా కొనసాగుతుండగా, ఆ పాత్ర గురించి ఆమె ఇంకా వివరాలు వెల్లడించకుండా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రంలో ప్రముఖ నటి శ్రీయ శరన్ ప్రత్యేక గీతంలో అదరగొట్టనుండగా.. సినిమా రొమాన్స్, యాక్షన్ అంశాలతో మిళితంగా రాబోతోంది. జోజు జార్జ్, జయరామ్, కరుణాకరన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. జ్యోతిక, సూర్య సంయుక్తంగా 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల పూజా హెగ్డే బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ సరసన ‘దేవా’ చిత్రంలో కనిపించింది. ‘రెట్రో’తో ఆమె తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోనుందేమో చూడాలి!
-
Home
-
Menu