'ఓజి సంభవం' సాంగ్ రాబోతోంది!

కోలీవుడ్ అల్టిమేట్ స్టార్ తల అజిత్ కొత్త సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ సినిమాలో అజిత్ డిఫరెంట్ షేడ్స్ తో ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ అందించబోతున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ రిలీజయ్యింది. టీజర్ లో అజిత్ డార్క్ స్వాగ్ ఫ్యాన్స్ కి మాస్ హై ఇచ్చింది. ఇప్పుడు ఈ మూవీకి మరింత బజ్ తీసుకొచ్చేందుకు మ్యూజికల్ అప్డేట్ రెడీ అయ్యింది.







'గుడ్ బ్యాడ్ అగ్లీ' నుంచి ఫస్ట్ సింగిల్ 'ఓజి సంభవం'ను మార్చి 18న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పాట గురించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ మాస్ బీట్, అజిత్ స్టైల్ కి పెర్ఫెక్ట్ మాస్ ఎలిమెంట్ గా నిలుస్తుందని టాక్.

మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా, ఏప్రిల్ 10న తమిళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్ రిలీజ్ కానుంది. మాస్ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈ మూవీలో అజిత్ ఎనర్జిటిక్ లుక్, పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ మరోసారి అభిమానులను మెస్మరైజ్ చేయనుంది. ‘ఓజి సంభవం’ సాంగ్ తో ఈ సినిమా మీద మరింత హైప్ క్రియేట్ కానుందేమో చూడాలి!.

Tags

Next Story