ప్రారంభం కానున్న నయనతార ‘మూక్కుత్తి అమ్మన్ 2’

ప్రారంభం కానున్న నయనతార ‘మూక్కుత్తి అమ్మన్ 2’
X

అద్భుతమైన ఆదరణ పొందిన ‘మూక్కుత్తి అమ్మన్’ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. దర్శకుడు సుందర్ C నేతృత్వంలో ‘మూక్కుత్తి అమ్మన్ 2’ మూవీ అధికారికంగా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. మార్చి 6, 2025న రాత్రి 9 గంటలకు చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్న ప్రొడక్షన్ హౌస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. “ఆధ్యాత్మిక వాతావరణంలో ఓ భారీ సినిమా ప్రయాణం ప్రారంభం! సుందర్ సి కాంబినేషన్‌లో మరో అద్భుతమైన ప్రాజెక్ట్! ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇదిగో మొదలవుతోంది! ‘మూక్కుత్తి అమ్మన్ 2’. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ సినిమా 2020లో విడుదలైన ‘మూక్కుత్తి అమ్మన్’ చిత్రానికి కొనసాగింపుగా వస్తోంది. మొదటి భాగాన్ని ఆర్జే బాలాజీ, యన్జే శరవణన్ కలిసి దర్శకత్వం వహించారు. నయనతార దేవత పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ‘మూక్కుత్తి అమ్మన్’ కథానాయకుడు ఎంగెల్స్ అనే జర్నలిస్ట్ చుట్టూ తిరుగుతుంది. అతని ఇంట్లో ఆరాధ్య దేవత సజీవం అవడం, అతని కోరికలు తీర్చడం, అవినీతి గురువులను బయటపెట్టడమే కథా సారాంశం. హాస్యపు మేళవింపుతో ఫేక్ గాడ్‌మెన్‌పై వ్యంగ్యంగా సాగిన ఈ చిత్రం ప్రజాదరణ పొందింది.

ఆర్జే బాలాజీ, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ఉర్వశి, స్మృతి వెంకట్, మధు మైలంకోడి, అభినయ, మౌళీ, అజయ్ ఘోష్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. డిస్నీ+ హాట్‌స్టార్ (ప్రస్తుతం జియోసినిమా) ద్వారా 2020 లో విడుదలైంది.

Tags

Next Story