కార్తి 29 లో నేచురల్ స్టార్?

కార్తి 29 లో నేచురల్ స్టార్?
X
నాచురల్ స్టార్ నాని ఈ మూవీలో సర్‌ప్రైజ్ కామియో చేస్తున్నాడన్న టాక్‌తో తమిళ, తెలుగు ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా హై అలర్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.

ఒక్క క్రేజీ రూమర్‌తోనే కార్తి 29 చుట్టూ ఉన్న బజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తమిళ స్టార్ కార్తి ఇప్పటికే ‘సర్దార్ 2, వా వాద్యార్’ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటే, ఇప్పుడు అతని 29వ మూవీ మరింత క్రేజీ ప్రాజెక్ట్ అయిపోయింది . ఇందుకు కారణం.. నాచురల్ స్టార్ నాని ఈ మూవీలో సర్‌ప్రైజ్ కామియో చేస్తున్నాడన్న టాక్‌తో తమిళ, తెలుగు ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా హై అలర్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో ఈ టాక్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ ఇప్పటికే ఫుల్ ఎక్సైట్‌మెంట్‌లో ఊగిపోతున్నారు.

తమిళ డైరెక్టర్ తెరకెక్కిస్తు్న్న ఈ ప్రాజెక్ట్‌ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. కార్తి 29 ఒక సీ-బేస్డ్ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. సముద్రం నేపథ్యంలో, హై-ఆక్టేన్ యాక్షన్, గ్రిప్పింగ్ సస్పెన్స్‌తో ఈ సినిమా తమిళ సినిమా రేంజ్ ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుందని టాక్. కార్తి ఈ సినిమాలో టోటల్‌గా డిఫరెంట్, బోల్డ్ అవతార్‌లో కనిపించబోతున్నాడని ఇన్‌సైడర్స్ చెబుతున్నారు. ఈ లుక్ గురించి ఇప్పటికే ఫ్యాన్స్ మధ్య హైప్ పీక్స్‌లో ఉంది. అయితే, ఈ సినిమాకి అసలు టర్నింగ్ పాయింట్ నాని కామియో అన్న రూమర్. ఈ వార్త వచ్చినప్పటి నుంచి తమిళ, తెలుగు ఫ్యాన్స్ రెండు ఇండస్ట్రీల నుంచి ఒక్కసారిగా ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోయారు.

ఈ క్యామియో కేవలం ఫ్రెండ్లీ గెస్ట్ అప్పీరియన్స్ కాదు. దీని వెనక బిగ్గర్ గేమ్ ప్లాన్ ఉంది. కార్తి ఇప్పటికే ‘హిట్ 4’ లో లీడ్ రోల్‌లో కన్ఫర్మ్ అయ్యాడు. మరోవైపు, నాని హిట్ ఫ్రాంచైజ్‌ని డ్రైవ్ చేస్తున్నాడు. గతంలో కార్తి ‘హిట్ 3’ లో క్యామియో చేశాడు. ఇప్పుడు నాని కార్తి 29 లో కనిపిస్తే.. ఇది కేవలం స్టార్ కొలాబరేషన్ కాదు. రెండు సినిమాటిక్ యూనివర్స్‌లనూ కనెక్ట్ చేసే క్రియేటివ్ మాస్టర్‌స్ట్రోక్ అవుతుంది. ఇద్దరూ నటనలో గ్రౌండెడ్, రియలిస్టిక్ స్టైల్‌కి ఫేమస్. అలాంటి ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేస్తే.. అది ఫ్యాన్స్‌కి బిగ్గెస్ట్ ట్రీట్ అవుతుంది.

Tags

Next Story