తలైవాను కింగ్ ఢీ కొడతాడా?

తలైవాను కింగ్ ఢీ కొడతాడా?
X
తాజా బజ్ ప్రకారం.. రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ లో నాగార్జున ప్రధాన విలన్‌గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోల్ కోసం ఆయన్ను సంప్రదించినట్టు సమాచారం.

కింగ్ నాగార్జున స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ఆకట్టు కుంటున్నారు. రజనీకాంత్ ‘కూలీ’, ధనుష్ ‘కుబేర’ చిత్రాల్లో ముఖ్యమైన రోల్స్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల కోసం ఆయనకు భారీ రెమ్యూనరేషన్ కూడా దక్కింది. ఇప్పుడు నాగార్జున తన 100వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు.

తాజా బజ్ ప్రకారం.. రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ లో నాగార్జున ప్రధాన విలన్‌గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోల్ కోసం ఆయన్ను సంప్రదించినట్టు సమాచారం. కానీ ఆయన ఇంకా తన నిర్ణయాన్ని వెల్ల డించలేదు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన వస్తుంది.

‘జైలర్ 2’ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కేరళలో ఒక లాంగ్ షెడ్యూల్ పూర్తయింది. రమ్యకృష్ణ, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ వంటి నటులు తమ పాత్రలను మళ్లీ పోషిస్తున్నారు. రికార్డు స్థాయి బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో చిత్రం రూపొందుతోంది. ‘జైలర్ 2’ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. రూమర్స్ ప్రకారం... బాలకృష్ణ ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించ నున్నారు. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి.

Tags

Next Story