‘జైలర్ 2’ లోనూ మోహన్ లాల్ ?

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్.. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించిన ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కేవలం తమిళ మార్కెట్‌లోనే కాకుండా, మాలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ విశేషంగా వసూళ్లు రాబట్టింది. తాజాగా, ‘జైలర్ 2’ లో మోహన్‌లాల్ నటించనున్నారా? అనే ప్రశ్నకు ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
గత కొంతకాలంగా తాను పలు తమిళ ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చిందని, దానికి ప్రధాన కారణం తను ‘ఎంపురాన్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటమేనని మోహన్‌లాల్ తెలిపారు. ఈ సినిమా షూటింగ్ కారణంగా తమిళ చిత్రాలను చేయలేకపోయానని ఆయన వివరించారు. అయితే, ‘జైలర్ 2’ లో నటించే అవకాశమొస్తే తప్పకుండా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని.. రజనీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ను షేర్ చేసుకోవడం తనకు ఆనందంగా ఉంటుందని మోహన్‌లాల్ అన్నారు.
మొదటి భాగంలో తన పాత్ర చిన్నదైనప్పటికీ ప్రభావశీలమైన పాత్రలో కనిపించినట్లు గుర్తు చేస్తూ... ‘జైలర్ 2’ లో తన పాత్ర కొనసాగించే అవకాశం ఉంటుందని కూడా ఆయన సూచించారు. ప్రస్తుతం ‘జైలర్ 2’ షూటింగ్ ప్రారంభమైంది. దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తుండగా, మొదటి భాగంలో ఉన్న శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్ వంటి స్టార్‌లు మళ్లీ కథలో భాగమవుతారా? అనే ప్రశ్న అభిమానులను ఆసక్తిగా మార్చింది. ఈ విషయంపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
-
Home
-
Menu