విలన్ గా అదరగొట్టబోతున్న నివీన్ పాలీ !

మాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ నివిన్ పాలీ.. తమిళ హీరో కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ’బెంజ్’ మూవీలో ప్రధాన విలన్ పాత్రను చేస్తుండడం విశేషం. ఈ ప్రాజెక్ట్‌ను ప్రెజెంట్ చేస్తున్న ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్, నివిన్ పాలీని ఈ కీలకమైన విలన్ రోల్‌లో చూడాలని గట్టిగా కోరుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను బక్కిరాజ్ కన్నన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇతను లోకేష్ కనగరాజ్‌తో కలిసి స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు.
‘బెంజ్’ ఒక హై-ఎనర్జిటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఇందులో రాఘవ లారెన్స్ యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించ నున్నారు. లోకేష్ కనగరాజ్ లాంటి దర్శకుడు ఈ ప్రాజెక్ట్‌తో అనుబంధం కావడంతో.. సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నివిన్ పాలీ విలన్‌గా చేరడం వల్ల ఈ హైప్ మరింత పెరిగింది. వాల్టర్ అనే వెరైటీ విలన్ రోల్ కోసం ప్రత్యేకంగా విడుదల చేసిన పోస్టర్ లో అతడి గెటప్ కు ఫిదా అవుతున్నారు ఆడియన్స్.
‘ప్రేమమ్’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో రొమాంటిక్ హీరోగా, ఆపై ‘1983, బెంగళూరు డేస్, ఒరు వడక్కన్ సెల్ఫీ’ లాంటి సినిమాలతో వైవిధ్యమైన పాత్రల్లో తన నటనా ప్రతిభను చాటుకున్నాడు నివీన్ పాలీ. అయితే.. అతడు ఎక్కువగా పాజిటివ్, లవబుల్ క్యారెక్టర్స్‌లోనే కనిపించాడు. ఇప్పుడు ‘బెంజ్’ మూవీలో విలన్‌గా నటించడం అనేది అతని కెరీర్‌లో ఒక సాహసోపేతమైన సవాలుగా అనుకోవాలి. నివిన్‌ను ఒక డార్క్, ఇంటెన్స్ అవతార్‌లో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది అతని నటనా సామర్థ్యాన్ని మరో కోణంలో ఆవిష్కరించే అవకాశంగా కనిపిస్తోంది.
-
Home
-
Menu