రజనీకాంత్ తో ‘మహారాజ’ దర్శకుడు

రజనీకాంత్ తో ‘మహారాజ’ దర్శకుడు
X
నితిలన్ సామినాథన్ గతంలో రజనీకాంత్‌ను కలిసి, ఆయనతో ఒక సినిమా చేయాలనే ఆలోచన గురించి చర్చించారు. ఇటీవల ఆయన ఓ ఫ్రెష్ స్క్రిప్ట్‌ను రజనీకాంత్‌కు నరేట్ చేశారు.

సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ‘జైలర్’ సినిమా ఊహించని ఊపును అందించింది. అది కూడా కెరీర్‌లో కీలకమైన సమయంలో. వయసు, ఆరోగ్య సమస్యలతో రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్న సమయంలో.. ‘జైలర్’ బ్లాక్‌బస్టర్ హిట్ ఆయనకు కొత్త జోష్‌ను, ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత రజనీకాంత్ ఫుల్ ఎనర్జీతో వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్‌లోనూ ఓ రకమైన క్రేజ్, హైప్ కనిపిస్తోంది, ఎందుకంటే ఆయన నటిస్తున్న ‘కూలీ’ సినిమా ఆగస్టు 14న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. అంతేకాదు, నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ కూడా తెరకెక్కుతోంది, ఇది వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘కూలీ’ మరియు ‘జైలర్ 2’ సినిమాలు కేవలం సినిమా హాల్స్‌లోనే కాదు, ప్రీ-రిలీజ్ బిజినెస్‌లోనూ భారీ రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. ఈ రెండు సినిమాల కోసం రజనీకాంత్ భారీ పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. అంతేకాదు, ఈ సక్సెస్ వేవ్‌ను కంటిన్యూ చేస్తూ కొత్త ప్రాజెక్ట్‌లను కూడా లైన్‌లో పెట్టేస్తున్నారు. ఇందులో భాగంగా, లేటెస్ట్ బజ్ ఏంటంటే, విజయ్ సేతుపతి నటించిన సూపర్ హిట్ ‘మహారాజా’ దర్శకుడు నితిలన్ సామినాథన్‌తో రజనీకాంత్ ఓ కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

నితిలన్ సామినాథన్ గతంలో రజనీకాంత్‌ను కలిసి, ఆయనతో ఒక సినిమా చేయాలనే ఆలోచన గురించి చర్చించారు. ఇటీవల ఆయన ఓ ఫ్రెష్ స్క్రిప్ట్‌ను రజనీకాంత్‌కు నరేట్ చేశారు. దానికి సూపర్‌స్టార్ నుంచి అధికారిక ఓకే కూడా వచ్చేసింది. అయితే, ఫైనల్ నరేషన్ తర్వాతే రజనీకాంత్ ఈ ప్రాజెక్ట్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నరేషన్ త్వరలోనే జరగనుందని తెలుస్తోంది. ఈ కొత్త సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ ఫిల్మ్స్ బ్యాంక్‌రోల్ చేయనుంది. ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్, కాస్టింగ్, టెక్నికల్ టీమ్ వివరాలు త్వరలో ఖరారు కానున్నాయి.

Tags

Next Story