‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ షూటింగ్ పూర్తి !

‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ షూటింగ్ పూర్తి !
X
తమిళ పుత్తాండు (తమిళ నూతన సంవత్సరం) సందర్భంగా.. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తైనట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

‘లవ్ టుడే, డ్రాగన్’ లాంటి లవ్ స్టోరీస్ తో తమిళ, తెలుగు భాషల్లో క్రేజీ హీరోగా మారాడు ప్రదీప్ రంగనాథన్. ప్రస్తుతం హైయస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటూ.. సౌత్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రదీప్ తదుపరి చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ తమిళ పుత్తాండు (తమిళ నూతన సంవత్సరం) సందర్భంగా.. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తైనట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం.

విఘ్నేష్ శివన్‌కు ఇది ఐదవ చిత్రంకాగా... ఇందులో ముఖ్య పాత్రలతో పాటు శీమాన్, ఎస్ జె సూర్యా, గౌరీ కిషన్, యోగి బాబు తదితరులు నటిస్తున్నారు. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రాన్ని నయనతార అండ్ ఎస్ ఎస్ లలిత్ కుమార్ 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. 2025 సమ్మర్‌లో థియేటర్లలో విడుదల కానుంది ఈ సినిమా. కామెడీ అండ్ రొమాన్స్ మిళితంగా ఈ సినిమా రూపొందుతోంది.



Tags

Next Story