'సర్దార్ 2' షూటింగ్ 100వ రోజు పూర్తి!

తమిళ యాక్షన్ స్టార్ కార్తి, తమిళ బ్రిలియంట్ డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్ కాంబోలో తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’. ఈ సినిమా షూటింగ్ సోమవారం నాటికి 100వ రోజును పూర్తి చేసుకుంది. ఈ చిత్ర షూటింగ్ తుదిదశకు చేరుకున్నట్టు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. సినిమాటోగ్రాఫర్ జార్జ్ సి. విలియమ్స్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో దర్శకుడు మిత్రన్ భుజంపై కెమెరా పెట్టి తీసిన ఫోటోను షేర్ చేస్తూ.. “డైరెక్టర్‌ను డైరెక్ట్ చేస్తున్నాం. హ్యాండ్‌హెల్డ్ ఫిల్మింగ్. 100వ రోజు షూట్ సర్దార్ 2” అనే క్యాప్షన్‌తో పోస్టు చేశాడు.
ఇంతకుముందు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పి.ఎస్. మిత్రన్ మాట్లాడుతూ, “ఇంకా కేవలం ఐదు నుంచి పది శాతం వరకు మాత్రమే షూటింగ్ మిగిలి ఉంది. డబ్బింగ్ కూడా పక్కపక్కనే జరుగుతోంది..” అని తెలిపారు. చాలా ఆసక్తికరంగా ప్రొలాగ్‌లో కార్తి జపనీస్ కటానా స్వోర్డ్‌తో ఫైటింగ్ సన్నివేశాల్లో కనిపించాడు. ఇది చైనాలో జరిగే సీన్ అని మిత్రన్ క్లారిటీ ఇచ్చారు. “కార్తికి ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాతోనే స్వోర్డ్ ఫైటింగ్‌లో మంచి ప్రాక్టీస్ ఉంది. అందువల్ల ఈ సన్నివేశాలకు తక్కువ ట్రైనింగ్ సరిపోయింది...” అని చెప్పారు.
‘సర్దార్ 2’ అనౌన్స్‌మెంట్ సమయంలో కార్తిని స్పైగా కాంబోడియాకు పంపుతున్నట్లు చూపించారు. ఇప్పుడు కథ చైనాకు మారిందా? అనే ప్రశ్నకు స్పందిస్తూ మిత్రన్, “మొదట కథ కాంబోడియాకు వెళుతుంది. ఆ తర్వాత చైనాకు మారుతుంది,” అని తెలిపారు. ఇటీవల విడుదలైన ప్రొలాగ్‌లో ఎస్. జె. సూర్యా ప్రధాన విలన్‌గా నటిస్తున్నట్టు వెల్లడైంది. ఆయన పాత్ర పేరు బ్లాక్ డ్యాగర్. ఈ చిత్రంలో కార్తి, ఎస్. జె. సూర్య, రజిషా విజయన్‌తో పాటు మలవికా మోహనన్, ఆశికా రంగనాథ్, సజల్ అహ్మద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
-
Home
-
Menu