ఆకట్టుకుంటోన్న ‘సర్దార్ 2' ప్రోలోగ్ వీడియో

ఆకట్టుకుంటోన్న ‘సర్దార్ 2 ప్రోలోగ్ వీడియో
X
ఈ సినిమాకు సంబంధించి. కార్తీ పాత్రను పరిచయం చేస్తూ ప్రోలోగ్ పేరుతో ఒక వీడియోను ఈద్ సందర్భంగా సోషల్ మీడియాలో విడుదల చేశారు మేకర్స్.

2022లో విడుదలైన తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్' కి కొనసాగింపుగా వస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ 'సర్దార్ 2'. ఈ సినిమాకు సంబంధించి. కార్తీ పాత్రను పరిచయం చేస్తూ ప్రోలోగ్ పేరుతో ఒక వీడియోను ఈద్ సందర్భంగా సోషల్ మీడియాలో విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ లాంటి వీడియోలో ఈ సారి సర్దార్ మిషన్ చైనీస్ తో లింక్ చేయడం ఆకట్టుకుంటోంది. అలాగే.. విలన్ గా యస్.జే. సూర్యను పరిచయం చేయడం కూడా ఇంప్రెసివ్ గా ఉంది.

తొలి భాగాన్ని రూపొందించిన పీ ఎస్ మిత్రన్ ఈ సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కార్తి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మొదటి పార్ట్‌లో ఆయన ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ముందుగా ప్రకటించిన యువన్ శంకర్ రాజా స్థానంలో ఇప్పుడు సామ్ సిఎస్ సంగీత దర్శకత్వం వహించనున్నారు. 'ఖైదీ' తర్వాత కార్తి, సామ్ సిఎస్ మళ్లీ కలిసి పనిచేయడం విశేషం. ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. విడుదల తేదీపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కార్తి సరసన ఎస్ జె సూర్య, మాళవిక మోహనన్, రజిష విజయన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సీక్వెల్ మొదటి భాగాన్ని కొనసాగిస్తూ.. ఓ పోలీస్ ఆఫీసర్ అంతర్జాతీయ నేర ముఠాను చేధించేందుకు చేసే ప్రయత్నాల్లో ఎదురయ్యే మోసాలు, అవినీతి, కుట్రలను అన్వేషించే విధానాన్ని చూపిస్తుంది. ఇందులో కార్తి ఓ పోలీస్ అధికారిగా, అలాగే నిందితుడిగా మారిన ఓ స్పై పాత్రలోనూ కనిపిస్తారు. మొదటి భాగంలో రాశీ ఖన్నా, చంకీ పాండే, లైలా ముఖ్య పాత్రలు పోషించారు. 'సర్దార్ 2' ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోంది.



Tags

Next Story