అన్న కంటే తమ్ముడి లైనప్ అదిరింది !

అన్న కంటే తమ్ముడి లైనప్ అదిరింది !
X
ప్రస్తుతానికి లైనప్ చూస్తే.. అన్న సూర్యకంటే ముందుగా కొత్త ప్రాజెక్టులను ఫైనలైజ్ చేస్తూ దూసుకెళ్తున్నాడు కార్తి.

‘పొన్నియిన్ సెల్వన్ సిరీస్, సర్దార్, మెయ్యళగన్’ సినిమాలతో కార్తీ కోలీవుడ్‌లో తన సత్తా చాటాడు. మధ్యలో జపాన్, కంగువా వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవకపోయినా.. అతని కెరీర్‌పై పెద్దగా ప్రభావం పడలేదు. టాలెంటెడ్ యాక్టర్‌గా పేరున్న కార్తీ, ఏడాదికి కనీసం రెండు సినిమాలను రెడీ చేసే స్పీడ్‌తో ఈసారి కూడా రెండు ప్రాజెక్టులను పూర్తి చేశాడు. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో ‘వా వాద్యార్’, పీఎస్ మిత్రన్ డైరెక్షన్‌లో ‘సర్దార్ 2’ సినిమాలను పూర్తి చేసిన కార్తీ, తన తదుపరి ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టేశాడు.

ప్రస్తుతానికి లైనప్ చూస్తే.. అన్న సూర్యకంటే ముందుగా కొత్త ప్రాజెక్టులను ఫైనలైజ్ చేస్తూ దూసుకెళ్తున్నాడు కార్తి. డైరెక్టర్ తమిళ్‌తో తన 29వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కార్తీ.. ఇప్పుడు లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ‘ఖైదీ 2’ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని కోలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కార్తీ కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటాడు.

రీసెంట్‌గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ చెప్పిన కథకు ఆసక్తి చూపిన కార్తీ, పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత ఫైనల్ డిసిషన్ తీసుకోవాలని భావిస్తున్నాడు. ఖాకీ సీక్వెల్ కూడా అతని అప్‌కమింగ్ ప్రాజెక్టుల జాబితాలో ఉంది. కార్తీతో సినిమాలు చేసేందుకు పా రంజిత్, మారి సెల్వరాజ్, సుందర్ సి, శివ లాంటి స్టార్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలను బట్టి చూస్తే, కార్తీ మరో 2-3 ఏళ్ల వరకు కొత్త ప్రాజెక్టులకు కాల్షీట్లు ఇవ్వలేనంత బిజీగా మారిపోయాడు.

Tags

Next Story