సైలెంట్ గా పట్టాలెక్కేసిన నాలుగో ‘కాంచన’

ప్రస్తుత హారర్ కామెడీ ట్రెండ్‌లో బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఈ జోనర్ చిత్రాలు ప్రేక్షకులను అలరించి విజయాలను సాధిస్తున్నాయి. ఒక హారర్ సినిమా హిట్ అయితే.. దానికి సీక్వెల్స్ తీసుకురావడం సర్వసాధారణంగా మారింది. ఇప్పుడు అలాంటి మరో సక్సెస్‌ఫుల్ సీక్వెల్ ప్రాజెక్ట్ షూటింగ్ షురూ చేసింది.
హారర్ కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారి.. ఇటు హీరోగా, అటు దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందాడు రాఘవ లారెన్స్. ‘ముని’ సిరీస్‌తో మొదలైన ‘కాంచన’ ఫ్రాంచైజీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీలో మూడు భాగాలు విడుదల కాగా... ఇప్పుడు నాలుగో భాగం ‘కాంచన 4’ సెట్స్‌పైకి వెళ్లింది. ఈ విషయాన్ని నిర్మాత మనీష్ అధికారికంగా వెల్లడించాడు.
‘కాంచన 4’ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో బాలీవుడ్ ఐటం క్వీన్ నోరా ఫతేహీ నటిస్తోంది. రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభ మవుతుందని సమాచారం. ఈ చిత్రాన్ని దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ భాగాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హారర్ కామెడీ అభిమానులకు ఈ ఫ్రాంచైజీ ఎంతగానో కనెక్ట్ అవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.
-
Home
-
Menu