నెక్స్ట్ మూవీ డైరెక్టర్స్ తో లోకనాయకుడు !

నెక్స్ట్ మూవీ డైరెక్టర్స్ తో లోకనాయకుడు !
X
తాజాగా ఆయన తన తదుపరి చిత్రానికి సంబంధించిన దర్శకులతో ఒక ప్రత్యేకమైన రోజు గడిపారు. తాత్కాలికంగా కేహెచ్237గా పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి.. కమల్ హాసన్ అన్బరివ్ దర్శకత్వ ద్వయంతో కలిసి కనిపించారు.

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్టులపై దృష్టి సారిస్తున్నారు. స్టార్ హీరో శింబుతో కలిసి నటిస్తున్న సినిమా ‘థగ్ లైఫ్’ తరువాత, తాజాగా ఆయన తన తదుపరి చిత్రానికి సంబంధించిన దర్శకులతో ఒక ప్రత్యేకమైన రోజు గడిపారు. తాత్కాలికంగా కేహెచ్237గా పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి.. కమల్ హాసన్ అన్బరివ్ దర్శకత్వ ద్వయంతో కలిసి కనిపించారు.

ఇంతకు ముందు వివిధ ప్రముఖ చిత్రాలకు స్టంట్ డైరెక్టర్లుగా పనిచేసిన అన్బరివ్ ద్వయం.. ఈ చిత్రంతో దర్శకులుగా తొలి అడుగు వేస్తున్నారు. వీరు కమల్ హాసన్‌తో లొకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ‘విక్రమ్’ చిత్రానికి కూడా కలిసి పనిచేశారు. “ఎక్స్ ప్లోర్ ది ఎక్స్పీరియన్స్” అంటూ ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ చిత్రాన్ని యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో కమల్ హాసన్ మరింత స్లిమ్ అవతారంలో కనిపించనున్నారు. సినిమా కధా నేపథ్యం గురించి అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూట్ మొదలు కాబోతోంది.

కమల్ హాసన్ తదుపరి చిత్రం ‘థగ్ లైఫ్’.. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోంది. ఇది ఒక గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. కమల్ హాసన్ కథను సహ రచయితగా కూడా రూపొందించగా, ఇందులో శింబు, త్రిష కృష్ణన్, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, అభిరామి, నాజర్, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రం 2025 జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది.

Tags

Next Story