ఈ వయసులో ఆ పనేంటి? అంటున్నారు !

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన “థగ్ లైఫ్” సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా విడుదలైంది. ఆ తర్వాత అది ఆన్‌లైన్‌లో భారీ చర్చలకు దారితీసింది. ముఖ్యంగా కొన్ని రొమాంటిక్ సన్నివేశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రైలర్‌లో 70ఏళ్ల కమల్ హాసన్ త్రిషా కృష్ణన్, అభిరామిలతో రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించడాన్ని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా అభిరామితో లిప్‌లాక్ సన్నివేశం వైరల్‌గా మారింది. అభిరామి వయస్సు 41. కమల్ హాసన్ వయస్సు దాదాపు 70. ఈ దృష్ట్యా ఇద్దరి మధ్య 30 సంవత్సరాల తేడా ఉండటాన్ని తప్పు పడుతున్నారు.
“కమల్-అభిరామి లిప్‌లాక్ చూసినప్పుడు వయస్సు వ్యత్యాసం కారణంగా అసహజత్వం అనిపిస్తోంది.జ.” అంటూ అనేక మంది సున్నితంగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కమల్ హాసన్‌కు ఈ తరహా సన్నివేశాలు కొత్తేమీ కావు. 1980ల నుండి ఇప్పటివరకు ఆయన పలు సినిమాల్లో రొమాన్స్, లిప్ కిస్‌లను ప్రేక్షకులు చూశారు. అయితే ఇప్పుడు మాత్రం వయస్సు నేపథ్యంలో ఇవి తగినవేనా అనే చర్చ ప్రారంభమైంది.
ఇక కమల్ అభిమానులు మాత్రం ఆయనకు గట్టిగా మద్దతుగా నిలుస్తున్నారు. “ఇది పాత్ర కోసం చేసిన అభినయం. అది ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రతిబింబించదు. వయస్సుతో సంబంధం లేకుండా కథకనుగుణంగా నటించడం ఒక్క నటుడి బాధ్యత” అని వారు అంటున్నారు. వాస్తవానికి, వయస్సు సినిమా పాత్రలను పరిమితం చేస్తుందా? లేక కల్పిత కథల్లో పాత్రల అవసరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలా? అనే చర్చ ఇప్పుడు నెటిజన్ల మధ్య ముదిరింది.
కమల్ హాసన్ నాటకీయతకు, ప్రయోగాలకు పెట్టింది పేరు. “థగ్ లైఫ్” ట్రైలర్‌లో కనిపించిన ఆయన విభిన్న గెటప్పులు, యాక్షన్ సన్నివేశాలు మాత్రం అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ రొమాంటిక్ ఎలిమెంట్స్ చుట్టూ నెలకొన్న దుమారం సినిమా విడుదలవుతున్న నాటికి ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
-
Home
-
Menu