టాలెంటెడ్ డైరెక్టర్ తో కమల్ హాసన్ ?

టాలెంటెడ్ డైరెక్టర్ తో కమల్ హాసన్ ?
X
అరుణ్ కుమార్ ఇప్పుడు ఉలగనాయగన్ కమల్ హాసన్‌తో జత కట్టబోతున్నాడని. టాక్ ప్రకారం, అరుణ్ కుమార్ చెప్పిన కథ కమల్‌ను బాగా ఇంప్రెస్ చేసిందట.

కోలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘చిత్త’ సినిమాతో దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్ ఒక్కసారిగా స్పాట్‌లైట్‌లోకి వచ్చాడు. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ సినిమా, ఓ సున్నితమైన సామాజిక అంశాన్ని చాలా సమర్థవంతంగా, సున్నితంగా తెరపై ఆవిష్కరించి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న సిద్ధార్థ్‌కు ఈ సినిమా గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చి, అతడి కెరీర్‌కు కొత్త ఊపిరి పోసింది. ‘చిత్త’ సక్సెస్‌తో అరుణ్ కుమార్ తన టాలెంట్‌ను చాటుకున్నాడు.

ఈ విజయం తర్వాత, అరుణ్ కుమార్ చియాన్ విక్రమ్‌తో ‘వీర ధీర సూరన్’ అనే యాక్షన్ డ్రామా సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాకు సినిమా విమర్శకుల నుంచి మంచి రివ్యూలు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద అది అంతగా ఆకట్టుకో లేకపోయింది. అయినా, అరుణ్ కుమార్ తన దర్శకత్వ ప్రతిభతో ఇండస్ట్రీలో తన మార్క్‌ను కొనసాగించాడు.

ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ఏంటంటే.. అరుణ్ కుమార్ ఇప్పుడు ఉలగనాయగన్ కమల్ హాసన్‌తో జత కట్టబోతున్నాడని. టాక్ ప్రకారం, అరుణ్ కుమార్ చెప్పిన కథ కమల్‌ను బాగా ఇంప్రెస్ చేసిందట. ఈ కథ విన్న తర్వాత కమల్ వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ సినిమా చాలా స్పీడ్‌గా పూర్తవుతుందని, 2026 ప్రారంభంలో థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతుందని ఇండస్ట్రీ టాక్. ఈ ప్రాజెక్ట్‌ను కమల్ హాసన్ సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మించనుందని తెలుస్తోంది.

ఇటీవల కమల్ హాసన్ కు ‘ఇండియన్ 2, థగ్ లైఫ్’ సినిమాలతో భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచి, కమల్‌పై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌కు దారితీశాయి. ఈ నేపథ్యంలో, అరుణ్ కుమార్‌తో జత కట్టిన కమల్, ఈ కొత్త ప్రాజెక్ట్‌తో తన గత వైభవాన్ని తిరిగి సాధిస్తాడా? సరైన స్క్రిప్ట్‌తో, గట్టి కమ్‌బ్యాక్ కొడతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ కాంబో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags

Next Story