‘కూలీ’ కోసం రంగంలోకి కమల్ హాసన్ ?

‘కూలీ’ కోసం రంగంలోకి కమల్ హాసన్ ?
X
లోకనాయకుడు కమల్ హాసన్ ఈ భారీ చిత్రంలో భాగమవనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు వాయిస్‌ ఓవర్ కోసం కమల్‌ను సంప్రదించారని, లోకేష్ కనగరాజ్‌తో ఆయనకున్న సన్నిహిత సంబంధం వల్ల ఈ ప్రతిపాదనకు ఆయన వెంటనే ఓకే చెప్పే అవకాశం ఉందని సమాచారం.

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమా, ఈ ఏడాది కోలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం అనడంలో ఎలాంటి సందేహం లేదు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. పూజా హెగ్డే, సౌబిన్ షాహిర్‌లతో కూడిన రెండో సింగిల్ మోనికా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

తమిళ మీడియాలో జరుగుతున్న చర్చల ప్రకారం.. లోకనాయకుడు కమల్ హాసన్ ఈ భారీ చిత్రంలో భాగమవనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు వాయిస్‌ ఓవర్ కోసం కమల్‌ను సంప్రదించారని, లోకేష్ కనగరాజ్‌తో ఆయనకున్న సన్నిహిత సంబంధం వల్ల ఈ ప్రతిపాదనకు ఆయన వెంటనే ఓకే చెప్పే అవకాశం ఉందని సమాచారం.

మూడో సింగిల్ పవర్ హౌస్ హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్‌లో రిలీజ్ కానుంది. అలాగే ఆగస్టు 2న థియేట్రికల్ ట్రైలర్ విడుదలవనుంది. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామాకు అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నాడు.

Tags

Next Story